Kitchen Hacks: తలుపులు, కిటికీలు, కబోర్డ్స్ కి చెద ఎక్కువగా పడుతోందా.. ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి!

సాధారణంగా చెక్కతో చేసిన వేటికైనా త్వరగా చెదలు పడుతూ ఉంటాయి. వీటిని ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇంటినే మొత్తం సర్వ నాశనం చేస్తాయి. ఒక్కసారి చెద పట్టిందంటే.. ఇంటి మొత్తం పాకేస్తుంది. ఎంత నీటిగా ఇంటిని శుభ్రంగా ఉంచినా.. రక రకాల క్రిమి కీటకాలు మనకు తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. చలి కాలం, వర్షా కాలంలో ఈ చెదలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇలా పట్టిన చెదలను వదిలించుకోవాలంటే.. ఈ టిప్స్ మీకు బాగా హెల్ప్..

Kitchen Hacks: తలుపులు, కిటికీలు, కబోర్డ్స్ కి చెద ఎక్కువగా పడుతోందా.. ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి!
Termites
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 17, 2023 | 7:28 PM

సాధారణంగా చెక్కతో చేసిన వేటికైనా త్వరగా చెదలు పడుతూ ఉంటాయి. వీటిని ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇంటినే మొత్తం సర్వ నాశనం చేస్తాయి. ఒక్కసారి చెద పట్టిందంటే.. ఇంటి మొత్తం పాకేస్తుంది. ఎంత నీటిగా ఇంటిని శుభ్రంగా ఉంచినా.. రక రకాల క్రిమి కీటకాలు మనకు తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. చలి కాలం, వర్షా కాలంలో ఈ చెదలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇలా పట్టిన చెదలను వదిలించుకోవాలంటే.. ఈ టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. మరి అవేంటో ఓ లుక్ వేసేయండి.

తడి కార్డ్ బోర్డ్ షీట్స్ ఉపయోగించండి:

చెద పురుగులను నివారించడంలో తడి కార్డ్ బోర్డ్ షీట్స్ బాగా ఉపయోగ పడతాయి. తడి కార్డ్ బోర్డ్ లో సెల్యులోజ్ ఉంటుంది. ఇది చెద పురుగులను నివారించడంలో బాగా హెల్ప్ అవుతాయి. చెద పురుగులు ఉన్న ప్రదేవంలో తడి కార్డ్ బోర్డ్ ను ఉంచాలి. కార్డ్ బోర్డ్ వాడటం వల్ల.. కొంత కాలంకి చెద పురుగులు అవే బయటకు వచ్చేస్తాయి. అవి బయకు రాగానే వాటిపై పురుగుల మందు పిచికారీ చేయండి. దీంతో చెద పురుగుల నశిస్తాయి.

ఇవి కూడా చదవండి

లవంగాల నూనె:

లవంగాలతో కూడా చెద పురుగులను నివారించు కోవచ్చు. ఒక స్ప్రే బాటిల్ లో కొద్దిగా లవంగాల ఆయిల్, కొద్దిగా నీరును పోయండి.. దీన్ని బాగా షేక్ చేసి.. చెద పురుగులు ఎక్కువగా ఉన్న చోట పిచికారీ చేస్తే.. చెద పురుగులు నశిస్తాయి. చెద పురుగులు మరీ ఎక్కువగా ఉంటే..వరుసగా వీటిని మూడు నుంచి నాలుగు రోజుల పాటు కంటిన్యూగా స్ప్రే చేయండి.

వెల్లుల్లి – వేప:

వెల్లులి రెబ్బలు, వేప ఆకులతో కూడా చెద పురుగులను తరిమి కొట్టొచ్చు. ఓ 8 వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి పేస్ట్ లా చేయండి. దీనికి వేప నూనె లేదా వేప ఆకుల పేస్ట్ కలపండి. వీటిలో వాటర్ పోసి.. మిశ్రమాన్ని వడకట్టండి. ఇలా వచ్చిన నీటిని ఓ స్ప్రే బాటిల్ లో వేసి.. చెద పట్టిన చోట స్ప్రే చేయండి. అంతే చెద పురుగులు నశిస్తాయి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్ కూడా చెదను నివారించడంలో బాగా ఉపయోగ పడుతుంది. చెద పురుగులు పట్టిన చోట అలోవెరా జెల్ ను రాయండి. దీంతో క్రమంగా చెద పురుగులు తొలగి పోతాయి. చెద మరీ ఎక్కువగా ఉంటే.. కంటిన్యూగా చెద తొలగేంత వరకూ అలోవెరా జెల్ ను రాయండి. క్రమంగా చెద అనేది తొలగి పోతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ