Coconut Fiber Benefits: కొబ్బరి పీచును పడేస్తున్నారా అయ్యయ్యో! ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..
భారత దేశంలో ఎక్కువగా కొబ్బరి కాయలను ఉపయోగిస్తూంటారు. శుభకార్యం ఏదైనా కొబ్బరి కాయ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతే కాకుండా గుడిలో పూజలు చేసేటప్పుడు కూడా కొబ్బరి కాయ కావాలి. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. కొబ్బరి కాయతో అనేక రకాలైన పిండి వంటలు, కూరలు, అన్నాలు తయారు చేస్తూ ఉంటారు. కొబ్బరిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అయితే అన్నీ కొబ్బరితో చేసినవే తింటారు. చాలా మంది కొబ్బరి నీరు, కొబ్బరి గుజ్జే ఉపయోగిస్తారు కానీ..
భారత దేశంలో ఎక్కువగా కొబ్బరి కాయలను ఉపయోగిస్తూంటారు. శుభకార్యం ఏదైనా కొబ్బరి కాయ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతే కాకుండా గుడిలో పూజలు చేసేటప్పుడు కూడా కొబ్బరి కాయ కావాలి. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. కొబ్బరి కాయతో అనేక రకాలైన పిండి వంటలు, కూరలు, అన్నాలు తయారు చేస్తూ ఉంటారు. కొబ్బరిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అయితే అన్నీ కొబ్బరితో చేసినవే తింటారు. చాలా మంది కొబ్బరి నీరు, కొబ్బరి గుజ్జే ఉపయోగిస్తారు కానీ.. కొబ్బరి పీచును మాత్రం పక్కకు పడేస్తారు. ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్య పరంగా దీన్ని ఎలా ఉపయోగించాలో చాలా మందికి అస్సలు తెలీనే తెలీదు. ఇక పై కొబ్బరి పొట్టును చెత్తలో పారేయకండి.. వాటితో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్థ రైటీస్ నొప్పి:
అర్థ రైటీస్ బాధ పడే వారికి కొబ్బరి పీచు గొప్ప ఔషధమని చెప్ప వచ్చు. మీరు కొబ్బరి పీచుతో తయారు చేసే టీ తాగండి. కొబ్బరి పొట్టులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి అర్థరైటీస్ నొప్పులకు చెక్ పెడతాయి.
వంట పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు:
ఇప్పుడైతే పాత్రలు శుభ్రం చేసుకోవడానికి స్క్రబ్స్ ని ఉపయోగిస్తున్నారు కానీ.. పూర్వం అయితే కొబ్బరి పీచుతోనే పాత్రలను తోమేవారు. కొబ్బరి పీచుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా పర్యావరణానికి మంచిది కూడా. అంతే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. కొబ్బరి పీచు, నిమ్మరసంతో కలిపి పాత్రలను క్లీన్ చేసుకుంటే.. ఎలాంటి మురికి వాసన లేకుండా మిలమిలమని మెరుస్తాయి.
పళ్లు తెల్లగా మారతాయి:
పసుపు పచ్చ పళ్లు ఉండే వారు.. కొబ్బరి పీచుతో పళ్లు తోముకుంటే దంతాలు తెల్లగా మారతాయి. దీని కోసం ఏం చేయాలంటే.. కొబ్బరి పీచును తీసుకుని.. దీని ఓ ఫాన్ పై నల్లగా అయ్యేలా చేయండి. ఇది ఇప్పుడు పౌడర్ లా మారుతుంది. ఈ పౌడర్ తో పళ్లు తోముకుంటే పళ్లు ముత్యాల్లా తెల్లగా మారడమే కాకుండా.. ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా నశిస్తుంది. కావాలంటే ఈ పౌడర్ లో నిమ్మ రసం చుక్కలు కూడా వేసుకోవచ్చు.
కొబ్బరి పీచుతో జుట్టును నల్లగా మార్చేయండి:
ముందుగా ఒక పాన్ లో కొబ్బరి పీచును వేసి నల్లగా మారేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారాక పౌడర్ లా చేసుకోండి. ఇందులో కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. దీన్ని జుట్టుకు అప్లై చేసి ఓ గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు నేచురల్ గా నల్లగా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.