Weight Loss Tips: ఇలా కూర్చూనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వండి!

బరువు పెరగడం చాలా ఈజీ కానీ.. బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం. బరువు పెరిగే కొలదీ అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ.. అంత సులభంగా తగ్గవు. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సమయానికి తినడం.. ఆరోగ్యకరమైనవి తినడం చాలా కష్టమై పోయింది. దొరికిన సమయంలో జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఈజీగా బరువు పెరుగుతున్నారు. అలాగే గంటలకు గంటలు కూర్చొని పని చేయడం వల్ల కూడా వెయిట్ పెరగడం అనేది జరుతుంది. అయితే కొన్ని రకాల వర్క్..

Weight Loss Tips: ఇలా కూర్చూనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వండి!
Weight Loss
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 17, 2023 | 7:32 PM

బరువు పెరగడం చాలా ఈజీ కానీ.. బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం. బరువు పెరిగే కొలదీ అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ.. అంత సులభంగా తగ్గవు. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సమయానికి తినడం.. ఆరోగ్యకరమైనవి తినడం చాలా కష్టమై పోయింది. దొరికిన సమయంలో జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఈజీగా బరువు పెరుగుతున్నారు. అలాగే గంటలకు గంటలు కూర్చొని పని చేయడం వల్ల కూడా వెయిట్ పెరగడం అనేది జరుతుంది. అయితే కొన్ని రకాల వర్క్ అవుట్స్ చేయడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అది కూడా కూర్చుని.. మరి ఆ వర్క్ అవుట్స్ ఏంటి? ఎలా చేస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వార్మప్:

ఏ వ్యాయామం చేయడానికి ముందు వార్మప్ చేయడం అనేది ఇంపార్టెంట్. దీని కోసం ముందుగా మోకాలిపై కూర్చొని మోకాలిని వంచాలి. ఆ తర్వాత కాళ్లు వేళ్లు నేలను తాకాలి. మోచేతులు వంచి అర చేతులు ముందుకు ఉండేలా ఉంచండి. నెక్ట్స్ కాళ్ళని పక్కలకి ఉంచుతూ ఉండాలి. పాదాలను వంచడం వంటివి కూడా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

చెయిర్ సైక్లింగ్:

ఈ ఎక్సర్ సైజ్ చేయాలంటే.. కుర్చీ అంచున కూర్చుని సైకిల్ తొక్కుతున్నట్లుగా కాళ్లను పెట్టాలి. ఈ టైమ్ లో పెడల్ తొక్కుతున్నట్లుగా స్పీడ్ ని పెంచాలి. ఇలా మూడు నుంచి ఐదు నిమిషాలు చేయాలి. ఈ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల కండరాలు అనేది బలంగా మారతాయి. అదే విధంగా కండరాల్లో పేరుకు పోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గొచ్చు.

జంపింగ్ జాక్:

ఈ వర్కౌట్ చేయాలంటే.. కుర్చీ అంచున కూర్చోవాలి. ఆ తర్వాత కాలి వేళ్లను అందుకునేలా ముందుకు వంగాలి. ఇలా చేతులతో కాలి వేళ్లను పట్టు కోవాలి. దీని వల్ల చేతులు అనేవి బలంగా మారతాయి. దీని వల్ల చేతులు, పొట్టలో ఉన్న కొవ్వు కరుగుతుంది.

చెయిర్ యోగా పోజ్:

సాధారణంగా యోగా అనేది నేలపై ఒక మ్యాట్ వేసుకుని చేస్తారు. ఈ యోగా కేవలం చెయిర్ పై మాత్రమే చేస్తారు. ముందుగా యోగా ముద్రలో చెయిర్ పై కూర్చోవాలి. ఆ తర్వాత శ్వాస వదులుతూ.. పీల్చుతూ ఉండాలి.

చెయిర్ ఎక్సర్ సైజ్ లు అనేవి ఈ మధ్య కొత్తగా వచ్చినవి. వీటిని కూర్చునే చేయవచ్చు. ఈ చెయిర్ ఎక్సర్ సైజ్ లలో చాలా రకాలు ఉన్నాయి. డైలీ చేస్తే 150 నుంచి 250 కేలరీల వరకూ తగ్గించు కోవచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ