అలాగే ఇంట్లో వండిన ఆహారాలను తినడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. బయటి ఆహారం తినడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది. పోషకాహార సమతుల్యతను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. లంచ్ - డిన్నర్ మధ్యలో వెన్న, సూప్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి తినాలి. ఇది గ్యాస్, హార్ట్ బర్న్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది