- Telugu News Photo Gallery Side Effects Of Coffee: Whar are the Side Effects Of Too Much Caffeine in telugu
Side Effects Of Coffee: కాఫీ ప్రియులకు చేదు వార్త.. ఈ సమస్యలున్న వారు పొరపాటున కాఫీ తాగారంటే..
కాఫీ తాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే పానీయాల జాబితాలో కాఫీ మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ కాఫీలు ఫేమస్. కాఫీకి అద్భుత రుచి మాత్రమే కాదు, పోషక విలువలు కూడా ఉంటాయి. కాఫీ లేని చిట్‌చాట్ ఉండదంటే నమ్మండి. మొదటి చూపులో కాఫీ, సంభాషణలో కాఫీ, మొదటి కాఫీ డేట్.. ఇలా కాఫీ మీ ప్రతి స్మృతిలో మమైకమై ఉంటుంది. కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభించలేని
Updated on: Nov 17, 2023 | 7:11 PM

కాఫీ తాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే పానీయాల జాబితాలో కాఫీ మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ కాఫీలు ఫేమస్. కాఫీకి అద్భుత రుచి మాత్రమే కాదు, పోషక విలువలు కూడా ఉంటాయి.

కాఫీ లేని చిట్‌చాట్ ఉండదంటే నమ్మండి. మొదటి చూపులో కాఫీ, సంభాషణలో కాఫీ, మొదటి కాఫీ డేట్.. ఇలా కాఫీ మీ ప్రతి స్మృతిలో మమైకమై ఉంటుంది. కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభించలేని వారు వారు కూడా ఉన్నారు. డిప్రెషన్‌ను అధిగమించే మార్గాలలో కాఫీ ఒకటి. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు కాఫీని అధికంగా తీసుకుంటే అది విషంగా మారుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, డయేరియాతో బాధపడేవారు కాఫీ లేదా బ్లాక్ కాఫీకి దూరంగా ఉండాలి. గ్లాకోమా అత్యంత తీవ్రమైన కంటి వ్యాధులలో ఒకటి. ఈ సమస్య ఉన్నవారు కూడా కాఫీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాఫీలో డైయూరిటిక్స్ ఉంటాయి. అందుకే కాఫీ తాగిన తర్వాత మూత్ర విసర్జన చేయాలని సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్యలతో బాధపడుతున్న వారికి కాఫీ తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు వారు కూడా కాఫీకి దూరంగా ఉండాలి. కాఫీ గుండె సాధారణ లయను ప్రభావితం చేస్తుంది. అలాగే కాఫీ తాగడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది.

తక్కువ నిద్రపోయే వారు, రాత్రంతా మేల్కొని నిద్రలేమితో బాధపడేవారు, అధిక రక్తపోటు ఉన్నవారికి కాఫీ అస్సలు తాగకూడదు. ఇది రక్తపోటును పెంచడంతోపాటు శరీరంలో అనేక సమస్యలను కూడా కలిగిస్తుంది. కాఫీకి బదులుగా జ్యూస్ లేదా మరేదైనా తాగడానికి ప్రయత్నించవచ్చు.





























