- Telugu News Photo Gallery Do you often eat mutton? Did you know that there is a possibility of getting fatal diseases?
Mutton Side Effects: తరచూ మటన్ తింటున్నారా.. ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలుసా!
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారుండరు. వెజ్ తినే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ నాన్ వెజ్ తినే వారి సంఖ్య మాత్రం ఎక్కువే. అందులోనూ చికెన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే మటన్ అంటే ఇష్ట పడేవారు కూడా ఉంటారు. ఎలాంటి ఫంక్షన్స్ అయినా మటన్ తప్పని సరిగా ఉండాలి. కొంత మంది అయితే వారంలో రెండు, మూడు సార్లు అయినా తినేస్తారు. కానీ మటన్ ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. మటన్ ని ఎక్కువగా తినడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల..
Updated on: Nov 16, 2023 | 9:19 PM

నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారుండరు. వెజ్ తినే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ నాన్ వెజ్ తినే వారి సంఖ్య మాత్రం ఎక్కువే. అందులోనూ చికెన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే మటన్ అంటే ఇష్ట పడేవారు కూడా ఉంటారు. ఎలాంటి ఫంక్షన్స్ అయినా మటన్ తప్పని సరిగా ఉండాలి. కొంత మంది అయితే వారంలో రెండు, మూడు సార్లు అయినా తినేస్తారు.

కానీ మటన్ ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. మటన్ ని ఎక్కువగా తినడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల బారిన పడతారని చెబుతున్నారు.

ఇన్ ఫ్లమేషన్ పెరుగుతుంది: మటన్ ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తీసుకో వడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లామేషన్ ఎక్కువగా పెరుగుతుందని చెబుతున్నారు. దీని వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

మటన ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె జబ్బులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే పోర్క్, బీఫ్ వంటి వాటితో పోల్చితే.. మేక మాంసంలో సంతృప్త కొవ్వులు అనేది తక్కువగా ఉంటాయి.

అయినా మటన్ ని వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీలైనంత వరకూ తక్కువ నూనెలో ఉడికించి తీసుకోవాలని, మటన్ ని గ్రిల్ చేసి తీసుకోవడం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.




