Health Care: అందంగా కనిపించాలా.. ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

అందంగా, ఎట్రాక్టీవ్ గా కనిపించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. నలుగురిలో వారే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలనుకుంటారు. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే ఇప్పుడున్న బీజీ లైఫ్ కారణంగా ఆ టైమ్ కూడా దొరకడం లేదు. దీంతో ముఖం నిర్జీవంగా, బాడీ నీరసంగా మారుతోంది. ఇక ఏమైనా ఫంక్షన్లు ఉంటే మాత్రం వెంటనే బ్యూటీ పార్లర్స్ కు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటేనే.. బయట శరీరం కూడా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎన్ని మేకప్ లు వేసినా..

Health Care: అందంగా కనిపించాలా.. ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Health
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2023 | 11:03 AM

అందంగా, ఎట్రాక్టీవ్ గా కనిపించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. నలుగురిలో వారే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలనుకుంటారు. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే ఇప్పుడున్న బీజీ లైఫ్ కారణంగా ఆ టైమ్ కూడా దొరకడం లేదు. దీంతో ముఖం నిర్జీవంగా, బాడీ నీరసంగా మారుతోంది. ఇక ఏమైనా ఫంక్షన్లు ఉంటే మాత్రం వెంటనే బ్యూటీ పార్లర్స్ కు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటేనే.. బయట శరీరం కూడా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎన్ని మేకప్ లు వేసినా.. ముఖంలో గ్లో ఉండక పోతే ఎట్రాక్టీవ్ అవ్వలేరు.

అందంగా కనిపించాలంటే విటమిన్లు, ఖనిజాలు, పలు పోషకాలు, శరీరానికి హైడ్రేషన్ అవసరం. శరీరం హైడ్రేషన్ గా ఉండాలంటే.. నీరు ఎక్కువగా తాగాలి. అలాగే నీరు శాతం ఉన్న పదార్థాలు కూడా తీసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా ఫైబర్, ఐరన్, ప్రోటీన్స్ వంటి రిచ్ ఫుడ్స్ ని తీసుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాల పోషకాలు తీసుకుంటేనే శరీరం ఫిట్, ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా బాడీలో విటమిన్ ఇ లోపం వల్ల ముఖం నీరసంగా, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పోషకాల లోపాల వలనే చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తారు. ఇలా అందంగా కనిపించడంలో హెల్ప్ చేసే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసు కోవాలి.

వ్యాయామం:

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్, ఆరోగ్యంగా తయారవుతుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. దీని వల్ల ముఖం, శరీరం ప్రకాశవంతంగా తయారవుతుంది. ముఖంపై మచ్చలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి.

ఆకు కూరలు:

ఆకు కూరల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషణ అందుతుంది. అలాగే చర్మం కూడా మెరిసి పోతుంది. అంతే కాకుండా బీట్ రూట్, క్యారెట్ తో కలిపి ఆహారాలు, జ్యూస్ లు తాగినా చర్మం గ్లోగా తయారై, మంచి పోషకాలు అందుతాయి.

సోయాబీన్:

సోయా బీన్ లో విటమిన్ -ఇతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా మెండుగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

బాదం – వేరుశనగ:

బాదం పప్పు, వేరు శనగలో కూడా విటమిన్ ఇ అనేది అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఒక గుప్పుడు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే వీటిని నాన బెట్టి తింటేనే మంచి రిజల్ట్స్ అందుతాయి. చర్మం కూడా కాంతి వంతంగా తయారవుతుంది.

అలాగే రోజూ 8 గ్లాసుల నీరు, ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలు తీసుకుంటే అందంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.