Black Sesame Seeds benefits: నల్ల నువ్వులు రోజూ తింటే.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు!

నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నువ్వుల్లో రెండు రకాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఒకటి తెల్ల నువ్వులు.. మరొకటి నల్ల నువ్వులు. నువ్వుల్ని వంటల్లో కూడా ఉపయోగిస్తూంటారు. నువ్వులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. నువ్వుల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది కేవలం తెల్ల నువ్వులు..

Black Sesame Seeds benefits: నల్ల నువ్వులు రోజూ తింటే.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు!
Black Sesame Seeds
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 16, 2023 | 9:18 PM

నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నువ్వుల్లో రెండు రకాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఒకటి తెల్ల నువ్వులు.. మరొకటి నల్ల నువ్వులు. నువ్వుల్ని వంటల్లో కూడా ఉపయోగిస్తూంటారు. నువ్వులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. నువ్వుల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది కేవలం తెల్ల నువ్వులు మాత్రమే తింటారు. కానీ నల్ల నువ్వుల్లో కూడా అంతే పోషకాలు ఉన్నాయని, ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది:

నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

నువ్వుల్లో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వాతావరణ మార్పులతో వచ్చే రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది:

నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

నువ్వుల్లో జింక్, క్యాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయ పడతాయి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తింటే.. ఎముకలు, వెన్నుపూస బలంగా మారతాయి.

జీర్ణ సమస్యలు మటుమాయం:

నల్ల నువ్వుల్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు. అంతే కాకుండా పేగుల కదలికలను సరి చేస్తుంది. దీంతో జీర్ణ క్రియ కూడా సాఫీగా జరుగుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది:

నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నల్ల నువ్వులు తినడం వల్ల శరీరంలో సెరొటోనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమి, నొప్పులు వంటివి కూడా తగ్గించేందుకు సహాయ పడుతుంది.

నల్ల నువ్వులను ఎలాంటి సమస్యలు ఉన్న వారైనా హ్యాపీగా ఎలాంటి డౌట్స్ లేకుండా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.