- Telugu News Photo Gallery Are the children crying a lot Stop their crying in one minute like this, check here is details
Parenting Tips: పిల్లలు బాగా ఏడుస్తున్నారా.. వాళ్ల ఏడుపును ఒక్క నిమిషంలో ఇలా మాన్పించేయండి!
చిన్న పిల్లలు అన్నాక ఏడవడం సహజమైన ప్రక్రియ. వారికి నోట్లోంచి మాట వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు. నొప్పి కలిగినా, దోమలు లేదా చీమలు కుట్టినా, భయం వేసినా, ఆకలి వేసినా.. ఏడుస్తూనే ఉంటారు. వాళ్ల ఏడుపు ఆపడం చాలా కష్టం. కొంత మందిని అయితే బుజ్జగించి.. ఏదో ఒకటి చూపిస్తే ఊరుకుంటారు. కానీ మరికొంత మంది మాత్రం అస్సలు ఏడుపు ఆపరు. ఏడుస్తూనే ఉంటారు. వాళ్ల ఏడుపుకు చిరాకు కూడా వస్తుంది. అయితే అలా బాగా ఏడ్చే చిన్నారులను కేవలం ఒక్క నిమిషంలో ఏడుపు ఆపవచ్చు. ఎలా అని షాక్ అవుతున్నారా..
Updated on: Nov 18, 2023 | 11:15 AM

చిన్న పిల్లలు అన్నాక ఏడవడం సహజమైన ప్రక్రియ. వారికి నోట్లోంచి మాట వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు. నొప్పి కలిగినా, దోమలు లేదా చీమలు కుట్టినా, భయం వేసినా, ఆకలి వేసినా.. ఏడుస్తూనే ఉంటారు. వాళ్ల ఏడుపు ఆపడం చాలా కష్టం. కొంత మందిని అయితే బుజ్జగించి.. ఏదో ఒకటి చూపిస్తే ఊరుకుంటారు. కానీ మరికొంత మంది మాత్రం అస్సలు ఏడుపు ఆపరు. ఏడుస్తూనే ఉంటారు. వాళ్ల ఏడుపుకు చిరాకు కూడా వస్తుంది. అయితే అలా బాగా ఏడ్చే చిన్నారులను కేవలం ఒక్క నిమిషంలో ఏడుపు ఆపవచ్చు. ఎలా అని షాక్ అవుతున్నారా.. నిజమే ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల శరీరంలో కొన్ని ప్రదేశాల్లో కొంత ఒత్తిడిని కలిగించి.. సున్నితంగా మర్దనా చేయడం వల్ల పిల్లల ఏడుపును దూరం చేయవచ్చు. దీన్నే ఆక్యు ప్రెషన్ అని కూడా పిలుస్తారు. ఈ పద్దతిలోనే చిన్నారుల ఏడుపు సమస్యలను సులభంగా నయం చేసుకోవచ్చు.

కాలి చివరి బొటన వేలు భాగాలను కాసేపు సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో, దంతాల సమస్యలు పోతాయి. కొంత మంది పిల్లలకు సైనస్, జలుబు వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కాలి బొటన వేలు మధ్యలో సున్నితంగా కాసేపు మర్దనా చేసు కోవాలి. అంతే కాదు అరి కాలిలో మసాజ్ చేస్తే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఇంకొంత మంది పిల్లలకు కడుపు, ఛాతి మధ్య భాగంలో కూడా నొప్పి వచ్చి ఏడుస్తారు . దీన్ని సోలార్ ప్లెక్సస్ అని అంటారు. దీన్ని తగ్గించాలంటే కాలి వేళ్ల భాగాల మధ్యలో సున్నితంగా మసాజ్ చేస్తూ ఉండాలి.

జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, మల బద్ధకం సమస్యలు తగ్గాలంటే.. పాదంపై వకంరగా, ఆర్క్ రూపంలో మర్దనా చేసుకోవాలి. అలాగే రెండు పాదాలకు కింది వైపు మధ్య భాగంలో మసాజ్ చేసినా పిల్లలు ఇట్టే ఏడుపును ఆపేస్తూంటారు.




