- Telugu News Photo Gallery Does showering your head every day prevent hair fall? What experts say, check here is details
Interesting Facts: రోజూ తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలి పోతుందా?
తల స్నానం వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే చేయాలని చాలా మంది చెబుతూ ఉంటారు. అందుకు కారణం ప్రతి రోజూ తల స్నానం చేస్తే జుట్టు రాలి పోతుందని భావిస్తూంటారు. అంతే కాకుండా ప్రతి రోజూ తల స్నానం చేయడం కుదరదు కూడా. జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ప్రతి రోజూ తల స్నానం చేస్తే జుట్టు రాలి పోతుందా.. ఇదే డౌట్ చాలా మందిలో ఉంది. జుట్టు రాలి పోవడానికి చాలా కారణాలు..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 18, 2023 | 11:20 AM

తల స్నానం వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే చేయాలని చాలా మంది చెబుతూ ఉంటారు. అందుకు కారణం ప్రతి రోజూ తల స్నానం చేస్తే జుట్టు రాలి పోతుందని భావిస్తూంటారు. అంతే కాకుండా ప్రతి రోజూ తల స్నానం చేయడం కుదరదు కూడా. జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ప్రతి రోజూ తల స్నానం చేస్తే జుట్టు రాలి పోతుందా.. ఇదే డౌట్ చాలా మందిలో ఉంది. జుట్టు రాలి పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మరి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

నేటి జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కారణం లేకుండానే వెంట్రుకలు రాలిపోతుంటాయి. శీతాకాలంలో ఈ సమస్య రెట్టింపు అవుతుంది. రోజుకు 100 వెంట్రుకలు రాలడం సహజం. రాలిన జుట్టు ప్రదేశంలో కొత్త వెంట్రుకలు పెరుగుతాయి. కానీ కొత్త జుట్టు పెరగడం ఆగిపోయినప్పుడు సమస్య మొదలవుతుంది. ఫలితంగా ఆ స్థలం ఖాళీగా ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ ఆపడానికి, కొత్త జుట్టు పెరగడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, కొత్త జుట్టు పెరగడానికి ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

వారానికి రెండు సార్లు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. షాంపూ తర్వాత కండీషనర్ పెడితే ఇంకా బెటర్ అని నిపుణులు అంటున్నారు. షాంపూ ప్రతి రోజూ నెత్తి మీద రాయడం వల్ల జీవం లేనట్టుగా ఉండి.. జుట్టు మూలాలు దెబ్బతిని ఊడి పోయే ప్రమాదం ఉంది.


అంతే కాకుండా షాంపూ రసాయనాలను ఎక్కువగా కలుపుతూ ఉంటారు. కాబట్టి షాంపూలను తరచూ ఎక్కువగా వాడినా జుట్టు రాలుతుంది. అలాగే తల స్నానం చేసేటప్పుడు కూడా వీలైనంత తక్కువగా షాంపూని వాడాలి. ఎక్కువగా పెట్టినా జుట్టు పొడి బారి కుదళ్లు బలహీన పడతాయి.





























