Nuvvula Palli Laddu: నువ్వులు, పల్లీలు కలిపి పిల్లలకు ఇలా చేసి పెట్టండి.. దృఢంగా తయారవుతారు!

నువ్వులు, పల్లీలు కలిపి తయారు చేసిన లడ్డూను రోజూ పిల్లలకు ఒక్కటి ఇవ్వండి.. బలంగా, స్ట్రాంగ్ గా తయారవుతారు. ఇవి చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్లు కూడా తినవచ్చు. రక్త హీనతతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, కాల్షియం తక్కువగా ఉన్నవారు, కీళ్ల నొప్పులతో బాధ పడేవారు, గుండె స్ట్రాంగ్ గా ఉండటానికి ఇలా ఏ సమస్య ఉన్న వారైనా నువ్వులు, పల్లీలతో తయారు చేసిన లడ్డూ తింటే.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. చిన్న వారి నుంచి వృద్ధుల వరకూ రోజూ ఒక్క లడ్డూ..

Nuvvula Palli Laddu: నువ్వులు, పల్లీలు కలిపి పిల్లలకు ఇలా చేసి పెట్టండి.. దృఢంగా తయారవుతారు!
Nuvvula Palli Laddu
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 18, 2023 | 9:48 PM

నువ్వులు, పల్లీలు కలిపి తయారు చేసిన లడ్డూను రోజూ పిల్లలకు ఒక్కటి ఇవ్వండి.. బలంగా, స్ట్రాంగ్ గా తయారవుతారు. ఇవి చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్లు కూడా తినవచ్చు. రక్త హీనతతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, కాల్షియం తక్కువగా ఉన్నవారు, కీళ్ల నొప్పులతో బాధ పడేవారు, గుండె స్ట్రాంగ్ గా ఉండటానికి ఇలా ఏ సమస్య ఉన్న వారైనా నువ్వులు, పల్లీలతో తయారు చేసిన లడ్డూ తింటే.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. చిన్న వారి నుంచి వృద్ధుల వరకూ రోజూ ఒక్క లడ్డూ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పరార్ అవుతాయి. మరి ఈ లడ్డూలను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల పల్లి లడ్డూకి కావాల్సిన పదార్థాలు:

నువ్వులు, పల్లీలు, నెయ్యి, బెల్లం.

ఇవి కూడా చదవండి

నువ్వుల పల్లి లడ్డూ తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టి.. మాడి పోకుండా దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక కప్పు పల్లీలు కూడా తీసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అర కప్పు నీళ్లు వేసి వేడి చేసుకోవాలి. ఈ నీళ్లతో పాటు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపు కోవాలి. ఈ బెల్లం పాకాన్ని తీగ పాకం వచ్చేంత వరకూ ఉడికించు కోవాలి. ఈ సమయంలోనే కొద్దిగా నెయ్యి వేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.

ఓ రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. ఇప్పుడు బెల్లం పాకం.. తీగ పాకం వచ్చాక.. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు, పల్లీలు వేసి బాగా కలుపు కోవాలి. దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకుంటూ లడ్డూల్లా చుట్టు కోవాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా అయితే.. మళ్లీ స్టవ్ మీద పెట్టి వేడి చేసి లడ్డూల్లా చుట్టు కోవాలి. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల పల్లీ లడ్డూ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.