Bellam Tea Benefits: చలి కాలంలో బెల్లం టీ తాగితే అమేజింగ్ బెనిఫిట్స్ .. వెయిట్ లాస్ కూడా!

వాతావరణం మారేటప్పుడు.. దానికి తగ్గట్టుగా ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ప్రస్తుతం చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా సూర్యుని వేడి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి.. భోజనం కూడా త్వరగా చేయాలి. శీతా కాలంలో చలి కారణంగా బద్ధకంగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది వ్యాయామాలు చేయడానికి..

Bellam Tea Benefits: చలి కాలంలో బెల్లం టీ తాగితే అమేజింగ్ బెనిఫిట్స్ .. వెయిట్ లాస్ కూడా!
Jaggery Tea
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 19, 2023 | 5:18 PM

వాతావరణం మారేటప్పుడు.. దానికి తగ్గట్టుగా ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ప్రస్తుతం చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా సూర్యుని వేడి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి.. భోజనం కూడా త్వరగా చేయాలి.

శీతా కాలంలో చలి కారణంగా బద్ధకంగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపరు. దీని కారణంగా ఫిట్ నెస్ కోల్పోతారు. ఇలాంటి సమయంలో బెల్లం టీ తాగితే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బెల్లం టీతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవక్రియను మెరుగు పరుస్తుంది:

ఇవి కూడా చదవండి

చలి కాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు అనేవి తగ్గుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి.. జీర్ణ క్రియ పెరుగుతుంది. దీంతో గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యల తగ్గుముఖం పడతాయి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

బెల్లంలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. కాబట్టి చలి కాలంలో బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో శరీరంలో బలంగా మారుతుంది. కాబట్టి ఇతర వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

వెయిట్ లాస్ అవ్వొచ్చు:

చలి కాలంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా చలి కాలంలో బరువు తగ్గే ఆహారాలను తీసుకోవాలి. ఈ క్రమంలో శరీరంలో కేలరీలను తగ్గించడంలో బెల్లం టీ బాగా పని చేస్తుంది.

పీరియడ్స్ నొప్పి తగ్గిస్తుంది:

కేవలం చలి కాలంలోనే కాకుండా ప్రతి రోజూ క్రమం తప్పకుండా మహిళలు బెల్లం టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లం టీతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లం టీ అద్భుతంగా పని చేస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో