కివి పండు.. కాస్త ఖరీదైనదే.. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలం.. ముఖ్యంగా కివి పండును డెంగ్యూ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి తప్పక తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, కివి పండు తొక్క.. గరుకుగా, దృఢంగా ఉంటుంది. అందుకే ఎవరూ తినేందుకు ఇష్టపడరు.. కానీ, కివి పండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ C పొందవచ్చు. నిజానికి, దాని పైతొక్క.. గుజ్జు కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.