Sai Pallavi: సాయి పల్లవి ఆ రూల్స్ పక్కన బెట్టేస్తుందా.. ఇక RC16 తో ఫ్యాన్స్‌కు పూనకాలే..!
సాయి పల్లవి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు.. ఎలాంటి సినిమాలు చేసాం.. ఎంత గుర్తింపు తెచ్చుకున్నాం అనేది ముఖ్యం అంటుంది సాయి పల్లవి. అందుకే హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఈ బ్యూటీకి అంత క్రేజ్ ఉంటుంది. కొన్ని నెలలుగా సినిమాలేవీ చేయట్లేదు సాయి పల్లవి. ఫిదా తర్వాత దాదాపు 30 సినిమాల ఆఫర్స్ వచ్చినా.. చాలా తక్కువ ఆఫర్స్ మాత్రమే ఓకే చేసింది ఈ భామ.