- Telugu News Photo Gallery Cinema photos Guntur Karam to Salaar Latest movie updates from film industry
Movie News: గుంటూరు కారం కోసం పవర్ స్టార్.. సలార్ టీం సీరియస్ వార్నింగ్..
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం పవన్ కళ్యణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా అనుకున్న దానికంటే ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఈ మధ్య సలార్ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్, వీడియోలు బయటికి వచ్చాయి. లియో సినిమాను మరోసారి గ్రాండ్‌గా థియేటర్స్ పెంచి విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా యానిమల్.
Updated on: Nov 19, 2023 | 9:52 AM

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం పవన్ కళ్యణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. గతంలో పవన్ నటించిన జల్సాకు మహేష్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే రీతిలో త్రివిక్రమ్ కోసం పవన్ తన వాయిస్ గుంటూరు కారం కోసం ఇస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 12న విడుదల కానుంది గుంటూరు కారం.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా అనుకున్న దానికంటే ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. భారతీయుడు 2 సినిమాను 2024 సమ్మర్‌కు విడుదల చేసి.. ఆ తర్వాత మూడు నాలుగు నెలల గ్యాప్‌లోనే భారతీయుడు 3 కూడా విడుదల చేయాలని చూస్తున్నారు శంకర్. ఈ లెక్కన 2024 డిసెంబర్‌కు కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చేలా కనిపించడం లేదు. ఇదే జరిగితే ఫ్యాన్స్‌కు మరింత ఎదురు చూపులు తప్పవు.

ఈ మధ్య సలార్ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్, వీడియోలు బయటికి వచ్చాయి. ఈ లీక్స్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు దర్శక నిర్మాతలు. తమ కంటెంట్‌ను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసిన ఓ ఇద్దరిని సైబర్ క్రైమ్ అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇకపై కూడా ఇంతే సీరియస్‌గా ఉంటామని.. లీక్స్ విషయంలో చర్యలు తప్పవంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు సలార్ మేకర్స్.

లియో సినిమాను మరోసారి గ్రాండ్‌గా థియేటర్స్ పెంచి విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. దసరాకు విడుదలైన ఈ చిత్రానికి 600 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అయితే తమిళనాడులో కొత్త సినిమాలేవీ లేకపోవడంతో.. లియోనే మరో 100 థియేటర్స్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 5వ వారంలోనూ లియో బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగిస్తోంది.

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా ట్రైలర్ విడుదల కంటే ముందే పాటలన్నీ ఇచ్చేస్తున్నారు. తాజాగా మరో సాంగ్ విడుదల కానుంది. పూర్తిస్థాయి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది యానిమల్. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్.




