ఐదేళ్లకు పైగానే సినిమాలకు దూరంగా ఉండి.. పదేళ్ళ నుంచి బ్లాక్‌బస్టర్ లేని కింగ్ ఖాన్.. పఠాన్‌తో విశ్వరూపం చూపించాడు. ఏకంగా 1000 కోట్లు వసూలు చేసాడు. ఆ తర్వాత వచ్చిన జవాన్ కూడా అంతే. పట్టు తప్పిన బాలీవుడ్‌ను ట్రాక్ ఎక్కించడానికి పఠాన్, జవాన్‌తో వచ్చినట్లుంది కింగ్ ఖాన్. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులతో విందు భోజనం పెట్టాడు ఈ హీరో. బోనస్‌గా రెండు సినిమాల్లోనూ అక్కడక్కడా మంచి దేశభక్తి సన్నివేశాలు కూడా పడ్డాయి. దాంతో రెండూ 1000 కోట్లు దాటేసాయి. అయితే కేవలం షారుక్ సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం.. మిగిలిన హీరోలకు రాకపోవడంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి.