AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips: ఇలాంటి ఆహారాలు తినేటప్పుడు నీటికి దూరంగా ఉండండి!

సాధారణంగా ఎలాంటి ఆహారం తిన్నా.. నీళ్లు తాగడం సహజం. తినడానికి కూర్చున్నారంటే నీటిని దగ్గర పెట్టుకుంటారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినేటప్పుడు నీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలతో నీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయని, వీటిని కలిపి తీసుకోకూడదని అంటున్నారు. పెరుగులో ప్రొబయోటిక్స్ అనేవి మెండుగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు..

Health Care Tips: ఇలాంటి ఆహారాలు తినేటప్పుడు నీటికి దూరంగా ఉండండి!
Water
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 19, 2023 | 5:15 PM

Share

సాధారణంగా ఎలాంటి ఆహారం తిన్నా.. నీళ్లు తాగడం సహజం. తినడానికి కూర్చున్నారంటే నీటిని దగ్గర పెట్టుకుంటారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినేటప్పుడు నీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలతో నీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయని, వీటిని కలిపి తీసుకోకూడదని అంటున్నారు. మరి ఆహార పదార్థాలు ఏంటి? ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు:

పెరుగులో ప్రొబయోటిక్స్ అనేవి మెండుగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పెరుగు తింటున్నప్పుడు కానీ.. తిన్న తర్వాత కానీ నీటిని తాగితే.. ప్రొబయోటిక్స్ పై ప్రభావం చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మసాలా ఆహారాలు:

స్పైసీ ఫుడ్స్ తినేటప్పుడు చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలాంటి ఆహారం తినేటప్పుడు నీటిని తాగడం వల్ల మంటను మరింత తీవ్రతరం చేస్తుంది. మసాలాలతో కూడుకున్న ఆహారం తినేటప్పుడు నోరు చల్ల బరచుకోవడానికి పాలు, పెరుగు వంటి వాటిని తీసుకోవాలి.

అన్నం:

అన్నం తినేటప్పుడు చాలా మంది ఎక్కువగా నీటిని తీసుకుంటారు. ఇలా తాగడం వల్ల జీర్ణ క్రియకు అవసరమైన యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. జీవ క్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సిట్రస్ ఫ్రూట్స్:

ద్రాక్ష పండ్లు, కమల, బత్తాయి, నిమ్మ కాయలు వంటి సిట్రస్ పండ్లలో నేచురల్ గానే నీటి శాతం అధికంగా ఉంటుంది. దానికి తోడు వీటిని తినేటప్పుడు నీళ్లు తాగడం వల్ల.. కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్నాక గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగడం ఉత్తమం.

అరటి పండ్లు:

అరటి పండ్లు తినేటప్పుడు కూడా నీటిని తాగకూడదు. ఎందుకంటే అరటి పండ్లలో పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది. బనానా తినేటప్పుడు నీటిని ఎక్కువగా తాగితే.. పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ లు కరిగి పోతాయి. దీని కారణంగా జీవ క్రియ అనేది నెమ్మదిస్తుంది. అందుకే అరటి పండ్లు తినేటప్పుడు నీళ్లు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!