Fennel Seeds Benefits: భోజనం చేసిన తర్వాత సోంపు తింటే ఏం జరుగుతుంది.. లాభమా.. నష్టమా!

చాలా మంది భోజనం చేశాక సోంపు తింటూంటారు. రెస్టారెంట్, హోటల్స్ కి వెళ్లినా భోజనం చేశాక.. బిల్లుతో పాటు సోంపును కూడా తీసుకొస్తూ ఉంటారు. గుప్పెళ్లతో తీసుకుని మరీ తినేస్తారు. పెళ్లిళ్లకు వెళ్లినా కూడా భోజనం తర్వాత సోంపును ఇస్తూంటారు. సోంపును నమిలి తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. బరువు తగ్గాలి అనుకునే వారు సోంపును తినడం చాలా బెస్ట్. భోజనం చేశాక తింటే.. తిన్న ఆహారం జీర్ణం అయిపోతుంది. దీంతో కొవ్వు నిల్ల ఉండే ఛాన్స్ ఉండదు. అయితే సోంపులో ఆకలిని నియంత్రణ చేసే గుణాలు..

Fennel Seeds Benefits: భోజనం చేసిన తర్వాత సోంపు తింటే ఏం జరుగుతుంది.. లాభమా.. నష్టమా!
Fennel Seeds
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 19, 2023 | 5:22 PM

చాలా మంది భోజనం చేశాక సోంపు తింటూంటారు. రెస్టారెంట్, హోటల్స్ కి వెళ్లినా భోజనం చేశాక.. బిల్లుతో పాటు సోంపును కూడా తీసుకొస్తూ ఉంటారు. గుప్పెళ్లతో తీసుకుని మరీ తినేస్తారు. పెళ్లిళ్లకు వెళ్లినా కూడా భోజనం తర్వాత సోంపును ఇస్తూంటారు. సోంపును నమిలి తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి భోజనం చేశాక సోంపు తింటే ఏం జరుగుతుంది? ఇంతకీ ఇలా తినడం వల్ల లాభమా.. నష్టామా.. ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపులోని పోషకాలు:

కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, కేలరీస్, సోడియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6 వంటి, యాంటీ ఇక్సిడెంట్లు, ఇన్ ఫ్లమేటరీ గుణాలు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణ క్రియను సాఫీగా చేస్తుంది:

భోజనం చేశాక సోంపు తినడం ఇప్పుడే కాదు పూర్వం నుంచి ఉంది. భోజనం చేశాక సోంపును నమిలి తినడం వల్ల జీర్ణ క్రియ అనేది సాఫీగా జరుగుతుంది. తిన్న ఆహారం ఎలాంటిదైనా.. జీర్ణం చేసే గుణాలు సోంపులో ఉంది. దీని వల్ల కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవు.

నోటి దుర్వాసన పోతుంది:

భోజనం చేశాక నోటిలో నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి వాసన రాకుండా ఉండాలంటే సోంపు తింటే సరి పోతుంది. అంతే కాకుండా మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఇది పని చేస్తుంది. నోటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

వెయిట్ లాస్ అవుతారు:

బరువు తగ్గాలి అనుకునే వారు సోంపును తినడం చాలా బెస్ట్. భోజనం చేశాక తింటే.. తిన్న ఆహారం జీర్ణం అయిపోతుంది. దీంతో కొవ్వు నిల్ల ఉండే ఛాన్స్ ఉండదు. అయితే సోంపులో ఆకలిని నియంత్రణ చేసే గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆకలి వేసేటప్పుడు సోంపు తినడం వల్ల ఆకటి కంట్రోల్ అవుతుంది. ఈ రకంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అంతే కాకుండా రాత్రంతా సోంపు నానబెట్టిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. అంతే కాకుండా శరీరానికి విటమిన్స్, మినరల్స్ అందుతాయి.

క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది:

క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు సోంపులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సోంపులో ఎనిథోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నశింప జేయడంలో సహాయ పడుతుందని తెలిపారు.

పాలు సమృద్ధిగా పడతాయి:

పాలిచ్చే తల్లులు.. సొంపును తినడం వల్ల వాళ్లకు సమృద్ధిగా పాలు పడతాయి. సోంపులో గలాక్టోజెనిక్ అనే గుణాలు ఉన్నాయి. కాబట్టి బాలింతలు సోంపును తమ ఆహారంలో చేర్చు కోవడం వల్ల పాలు పడతాయి. సోంపు పొడిని అయినా తీసుకోవచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.