- Telugu News Photo Gallery Chocolate for Skin Glow: Chocolate can help Skin Glow, check here is details in Telugu
Chocolate for Skin Glow: చాక్లెట్ ని ఇలా తింటే.. మీ స్కిన్ దగదగమని మెరుస్తుంది!
చాక్లెట్ అంటే ఇష్ట పడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న వారి దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ చాక్లెట్ ని ఇష్టంగా తింటారు. అయితే చాక్లెట్ తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని దూరంగా పెడుతూ ఉంటారు. కానీ చాక్లెట్ ని సరిగ్గా తింటే.. స్కిన్ గ్లో కూడా పెంచుకోవచ్చన్న విషయం ఎవరికీ తెలీదు. అంతే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బ్యూటీకి, చాక్లెట్ కి, ఆరోగ్యానికి లింక్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో చాక్లెట్ కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయి. ఎందుకంటే పాలతో కలిపిన చాక్లెట్స్ లో శరీరానికి..
Updated on: Nov 19, 2023 | 5:16 PM

చాక్లెట్ అంటే ఇష్ట పడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న వారి దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ చాక్లెట్ ని ఇష్టంగా తింటారు. అయితే చాక్లెట్ తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని దూరంగా పెడుతూ ఉంటారు. కానీ చాక్లెట్ ని సరిగ్గా తింటే.. స్కిన్ గ్లో కూడా పెంచుకోవచ్చన్న విషయం ఎవరికీ తెలీదు. అంతే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బ్యూటీకి, చాక్లెట్ కి, ఆరోగ్యానికి లింక్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పాలలో చాక్లెట్ కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయి. ఎందుకంటే పాలతో కలిపిన చాక్లెట్స్ లో శరీరానికి కావాల్సినన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందుతారట. నార్మల్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ తింటే ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు డార్క్ చాక్లెట్ ని తీసుకుంటే స్కిన్ కి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చర్మంపై ఉన్న పింపుల్స్, మచ్చలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే కోకో.. చర్మాన్ని సాఫ్ట్ గా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

డార్క్ చాక్లెట్ లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా ఇవి బాడీని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయ పడతాయి. డార్క్ చాక్లెట్ ని క్రమం తప్పకుండా తింటే చర్మాన్ని డిటాక్స్ చేస్తుంది.

చర్మం లోపల ఉండే మలినాలను, చర్మంపై ఉండే మృత కణాలను తొలగించడంలో హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి తీవ్ర చర్మ సమస్యలు ఉన్న వారు కూడా క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్ తింటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.




