Health Tips: ఈ చేదు కూరగాయ ఆకులు కూడా దివ్యౌషధమే..! డజన్ల కొద్దీ వ్యాధులను తరిమికొడతాయి.. ముఖ్యంగా ఈ చలికాలంలో..
వైద్యులు తరచుగా పచ్చి కూరగాయలు తినమని సలహా ఇస్తుంటారు. గ్రీన్ వెజిటేబుల్స్ లో శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. అటువంటి పచ్చి కూరగాయలో కాకరకాయ ఒకటి. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. పచ్చని కూరగాయలతో కాకరకాయకు పోలిక లేదు. అయితే కాకరకాయ ఆకుల వల్ల కూడా బోలేడు ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాకరకాయ ఆకు మిమ్మల్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం.
Updated on: Nov 17, 2023 | 2:46 PM

వైద్యులు తరచుగా పచ్చి కూరగాయలు తినమని సలహా ఇస్తుంటారు. గ్రీన్ వెజిటేబుల్స్ లో శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. అటువంటి పచ్చి కూరగాయలో కాకరకాయ ఒకటి. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు.

పచ్చని కూరగాయలతో కాకరకాయకు పోలిక లేదు. అయితే కాకరకాయ ఆకుల వల్ల కూడా బోలేడు ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాకరకాయ ఆకు మిమ్మల్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం.

కాకర దాని చేదు కూరగాయగా, దాని రసం మధుమేహులకు ఔషధంగా చాలా మందికి తెలుసు. అయితే, అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందించే దాని ఆకుల లక్షణాల గురించి చాలా మందికి తెలియదు. చేదు ఆకులతో రోగాలు నయమవుతాయి

చర్మ వ్యాధులను దూరం చేస్తుంది: కాకరకాయ ఆకు అనేక రకాల ఔషధగుణాలు కలిగి ఉంటుంది. శరీర ఇన్ఫెక్షన్లు మీకు రాకుండా నివారిస్తుంది. ఇది రింగ్‌వార్మ్, దురద, తలనొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అరికాళ్ళలో మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చాలా మందికి రక్తంలో పేరుకుపోయిన మలినాల కారణంగా వారు అరికాళ్ళలో, శరీరంలోని వివిధ భాగాలలో మండుతున్న అనుభూతితో బాధపడుతుంటారు. అలాంటి వారికి చేదు ఆకు మీకు అద్బుత ఔషధంగా పనిచేస్తుంది.

కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే పోషకాల కారణంగా పొట్ట సమస్యలు దరిచేరవు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అలాగే, కాకరకాయ తీసుకోవడం వల్ల మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

మహిళలు తమ పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పిని ఎదుర్కొంటారు. చేదు ఆకులను తీసుకుంటే ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం 10 నుంచి 15 చేదు ఆకుల రసం తీసి అందులో నల్లమిరియాల పొడి, శెనగ పొడి, సోపు కలిపి తాగాలి.




