AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇల్లెక్కి గుడ్డుపెట్టిన కోడి..! నేరుగా పెనంలోకే.. ఏం లక్కు గురూ అంటూ తెగ నవ్వుకుంటున్న జనాలు..

వైరల్‌ వీడియోలో ఓ చోట రేకుల షేడ్డుతో వేసిన ఇంటిపై ఒక కోడి గుడ్డుపెడుతూ కనిపించింది. అయితే, సరిగ్గా కోడి గుడ్డుపెట్టే ప్రదేశానికి ఎదురుగా ఆ ఇంటి ముందే ఓ వ్యక్తి వంటకు సిద్ధం చేస్తున్నాడు. రేకుల షెడ్డుపై కోడి గుడ్డు పెట్టగానే..అది నేరుగా జారుకుంటూ వచ్చి అతడు వంట చేసేందుకు పెట్టిన కడాయిలోకి పడింది.. దాంతో అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఏం జరిగిందో తెలియక తికమకపడ్డాడు.. ఓసారి అటూ ఇటూ చూసే సరికి రేకుల షెడ్డుపై కోడి కనిపించింది.

Watch Video: ఇల్లెక్కి గుడ్డుపెట్టిన కోడి..! నేరుగా పెనంలోకే.. ఏం లక్కు గురూ అంటూ తెగ నవ్వుకుంటున్న జనాలు..
Hen Egg Slipped
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2023 | 12:12 PM

Share

సోషల్ మీడియాలో చాలామంది క్రియేటివ్ పీపుల్ కనిపిస్తుంటారు. వారు చేసే రకరకాల క్రియేటివ్ వర్క్స్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే, నిత్యం వందలాది ఫన్నీ వీడియోలు, షాకింగ్ సీన్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి వీడియోలను చూసినప్పుడు మనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోక తప్పదు. అలాంటి ఫన్నీ వైరల్‌ వీడియోలను చూసేందుకు ప్రజలు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంటి పైకప్పు మీద కోడి గుడ్లు పెడుతోంది. ఇందులో విశేషం ఏంటని ఆశ్చర్యపోవాల్సింది ఏముందనుకుంటున్నారు కాదా..? అక్కడే ఉంది అసలు విషయం..పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో ఓ చోట రేకుల షేడ్డుతో వేసిన ఇంటిపై ఒక కోడి గుడ్డుపెడుతూ కనిపించింది. అయితే, సరిగ్గా కోడి గుడ్డుపెట్టే ప్రదేశానికి ఎదురుగా ఆ ఇంటి ముందే ఓ వ్యక్తి వంటకు సిద్ధం చేస్తున్నాడు. రేకుల షెడ్డుపై కోడి గుడ్డు పెట్టగానే..అది నేరుగా జారుకుంటూ వచ్చి అతడు వంట చేసేందుకు పెట్టిన కడాయిలోకి పడింది.. దాంతో అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఏం జరిగిందో తెలియక తికమకపడ్డాడు.. ఓసారి అటూ ఇటూ చూసే సరికి రేకుల షెడ్డుపై కోడి కనిపించింది. ఓ ఇదా సంగతి అన్నట్టుగా అతడు.. వెంటనే కడాయిలోంచి కోడిగుడ్డు పెక్కులు తీసి పారేసి వేగంగా ఆమ్లెట్‌ తయారు చేసుకున్నాడు. వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా నవ్వు ఆగదు.

ఇవి కూడా చదవండి

ఇంటర్ నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. చాలా మంది నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఎంత ఫన్నీ ఇన్సిడెంట్‌ కదా అనుకుంటూ ప్రజలు ఈ వీడియోను పదే పదే చూస్తున్నారు. అదే సమయంలో చాలా మంది నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియో @ThebestFigen అనే ఖాతాతో Xలో భాగస్వామ్యం చేయబడింది. ఇది ఇప్పటివరకు 1.7 మిలియన్ వీక్షణలను పొందింది. ఈ ఫన్నీ వీడియోని చాలా మంది షేర్ చేస్తున్నారు. ‘ప్రకృతి చేసిన అద్భుతం’ అని కూడా ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..