Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమోసా ప్రియులరా తస్మాత్‌ జాగ్రత్త..! బంగాళదుంపకు బదులుగా బల్లి మాంసం..!! వీడియో వైరల్

పండగ సందర్భంగా ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం సమోసాలు కొంటున్నాడు. అయితే ఈ సమోసాలు తిని తన కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారని తనకు ముందుగా తెలియదు. ఎంతో రుచికరంగా ఉండే సమోసాలు కొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇంటిల్లిపాది ఆ సమోసాలను తిన్నారు. ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన సమోసాలను అతడు కూడా తింటుండగా రుచిలో ఏదో తేడా అనిపించి చూశాడు. దాంతో సమోసా లోపల బంగాళదుంపకు బదులుగా బల్లి కనిపించింది.

సమోసా ప్రియులరా తస్మాత్‌ జాగ్రత్త..! బంగాళదుంపకు బదులుగా బల్లి మాంసం..!! వీడియో వైరల్
Lizard In Samosa
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 17, 2023 | 1:14 PM

సమోసాలంటే ఇష్టం లేని వారంటూ బహుశా ఎవరు ఉండకపోవచ్చు! కొంతమంది ఈ రుచికరమైన స్నాక్‌ ఐటమ్‌ని ప్రతిరోజూ టీతో తినడానికి ఇష్టపడతారు. మరికొందరు ఎప్పుడు టైమ్‌ దొరికినా సరే, స్నేహితులతో కలిసి లేదంటే ఫ్యామిలీతో కలిసి సమోసా తినేందుకు బయటకు వెళ్తుంటారు. సింగిల్‌గా కూడా సమోసా తెచ్చుకుని తింటుంటారు. అలాంటి సమాసాలు చాలా వెరైటీలు తయారు చేస్తూ భోజన ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు వ్యాపారులు. కార్న్‌ సమోసా, ఆనియన్‌ సమోసా, ఆలు సమోసా, కీమా సమోసా ఇలా అనేక రకాల సమోసాలు ప్రజల్ని నోరూరిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో వెలుగుచూసిన ఓ ఘటన సమోసా ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యూపీలోని హాపూర్‌లో ఒక దుకాణం నుండి సమోసాలు కొన్న వ్యక్తి.. వాటిని తింటుండగా,..అతనికి అదేదో వింతగా అనిపించింది. వెంటనే అతని కళ్ళు సమోసా లోపలికి వెళ్ళాయి. అది చూసిన అతడు ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు.. ఆ సమోసా లోపల బంగాళదుంపలకు బదులు బల్లి ఉండటం చూసిన అతడు వణికిపోయారు.

పండగ సందర్భంగా ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం సమోసాలు కొంటున్నాడు. అయితే ఈ సమోసాలు తిని తన కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారని తనకు ముందుగా తెలియదు. ఎంతో రుచికరంగా ఉండే సమోసాలు కొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇంటిల్లిపాది ఆ సమోసాలను తిన్నారు. ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన సమోసాలను అతడు కూడా తింటుండగా రుచిలో ఏదో తేడా అనిపించి చూశాడు. దాంతో సమోసా లోపల బంగాళదుంపకు బదులుగా బల్లి కనిపించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అతడు వాంతులు చేసుకున్నాడు..వారిలో13 ఏళ్ల చిన్నారి కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. వెంటనే బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

జరిగిన సంఘటనను ఆ ఇంట్లోని వారు కూడా నమ్మలేకపోతున్నాం అంటున్నారు. ఈ వార్త స్థానికంగా దావానంలా వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొద్దిసేపటికే ఆ వ్యక్తి ఇంటి బయట జనం గుమిగూడారు. దీంతో బాధిత కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో చూసిన వినియోగదారులు కూడా షాక్ అయ్యారు. ఈ వీడియో చాలా మంది సమోసా ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. బల్లి సమోసాలు తిన్న వ్యక్తి ఆరోగ్యం క్షీణించిందని వైరల్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు స్పందన తెలియజేస్తున్నారు. రకరకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..