AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతటి దారుణం..! తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన మైనర్‌ బాలిక.. టాయిలెట్‌లో పడిపోవటంతో వెళ్లి చూడగా..

10వ తరగతి చదువుతున్న బాలికకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ తల్లడిల్లిపోయింది. కడుపు నొప్పిగా ఉందని బాలిక వైద్యులకు చెప్పడంతో.. అక్కడ బాలికకు అన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు..అనంతరం ఆమెను అత్యవసర విభాగానికి తరలించారు. విరేచనాలతో బాధపడుతున్న బాలిక బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే

ఎంతటి దారుణం..!  తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన మైనర్‌ బాలిక.. టాయిలెట్‌లో పడిపోవటంతో వెళ్లి చూడగా..
Hathras Uttar Pradesh
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2023 | 12:50 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఓ మైనర్ బాలిక ఆసుపత్రి టాయిలెట్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. హత్రాస్‌ గేట్‌ ప్రాంతం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక మథుర జిల్లాలో ఓ గ్రామంలో తన తల్లితో కలిసి ఉంటోంది. 10వ తరగతి చదువుతున్న బాలికకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ తల్లడిల్లిపోయింది. కడుపు నొప్పిగా ఉందని బాలిక వైద్యులకు చెప్పడంతో.. అక్కడ బాలికకు అన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు..అనంతరం ఆమెను అత్యవసర విభాగానికి తరలించారు. విరేచనాలతో బాధపడుతున్న బాలిక బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇది చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలియడంతో అప్పుడే పుట్టిన బాలిక, ఆమె తల్లిని మహిళా ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆ తల్లి బిడ్డలను అక్కడే విడిచిపెట్టి ఆసుపత్రి నుండి పారిపోయేప్రయత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకున్నారు పోలీసులు. అక్కడ్నుంచి వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించారు.

ఈ విషయంపై మహిళా మెడికల్ ఆఫీసర్ శైలీ సింగ్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని టాయిలెట్‌లో ఓ మైనర్ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. బాలిక తన తల్లి వద్దే ఉంటూ యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్నట్టుగా తేల్చారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చిందని బాధితులు చెప్పిందని వారు తెలిపారు. ఇదిలా ఉండగానే.. విద్యార్థిని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు.. విద్యార్థిని శరీరంలో రక్తం తక్కువగా ఉందని డాక్టర్‌ తెలిపారు. ఆమెకు రక్తం ఎక్కించారు.. మరోవైపు ఇప్పుడు విద్యార్థి కుటుంబ సభ్యులు విద్యార్థినితో సంబంధమున్న యువకుడి కుటుంబ సభ్యులను సంప్రదించి వారికి పెళ్లి చేయాలని నిశ్చయించారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై జిల్లా మహిళా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శైలీ సింగ్ మాట్లాడుతూ.. బాలిక శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్లే ఆమెకు రక్తం ఎక్కిస్తున్నారని చెప్పారు.. కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..