AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure: ఏయే వయసుల వారికి బీపీ ఎంతెంత ఉండాలో తెలుసా? సాదారణ రక్తపోటు కొలతలు ఇవే

శరీరంలో రక్తపోటు ఏ వయసు వారికి ఎంత ఉండాలి అనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ప్రతి ఒక్కరికీ రక్తపోటు 120/80గా పరిగణిస్తారు. ఇది రక్తపోటు సాధారణ కొలత. రక్తపోటు పరిధులు వయస్సుతో మారుతూ ఉంటాయి. అందుకే ఖచ్చితమైన రక్తపోటు సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రమరహిత రక్తపోటు అనేక వ్యాధుల సంక్రమణకు లక్షణం.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెద్దవారిలో 95-145/60-90 మధ్య రక్తపోటు కూడా సాధారణమైనదిగా పరిగణిస్తారు. కానీ అది వ్యక్తి శారీరక స్థితిపై

Blood Pressure: ఏయే వయసుల వారికి బీపీ ఎంతెంత ఉండాలో తెలుసా? సాదారణ రక్తపోటు కొలతలు ఇవే
Blood Pressure Chart
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 16, 2023 | 7:03 PM

శరీరంలో రక్తపోటు ఏ వయసు వారికి ఎంత ఉండాలి అనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ప్రతి ఒక్కరికీ రక్తపోటు 120/80గా పరిగణిస్తారు. ఇది రక్తపోటు సాధారణ కొలత. రక్తపోటు పరిధులు వయస్సుతో మారుతూ ఉంటాయి. అందుకే ఖచ్చితమైన రక్తపోటు సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రమరహిత రక్తపోటు అనేక వ్యాధుల సంక్రమణకు లక్షణం.

సాధారణ రక్తపోటు ఎంత ఉండాలంటే..

120/80 సాధారణ రక్తపోటు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెద్దవారిలో 95-145/60-90 మధ్య రక్తపోటు కూడా సాధారణమైనదిగా పరిగణిస్తారు. కానీ అది వ్యక్తి శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. రోగి ఇతర పరిస్థితులను బట్టి వైద్యులు కొన్ని సందర్భాల్లో 145/90 రక్తపోటును సాధారణమైనదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు.. 20 ఏళ్ల వయోజన వ్యక్తిలో వ్యాధి సంకేతాలు లేకుంటే 90/50 రక్తపోటు కూడా సాధారణంగానే పరిగణిస్తారు.

రక్తపోటును ప్రభావితం చేసే అంశాలు ఏవంటే..?

రక్తపోటును ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. ఇది వయస్సు, లింగం, జాతి, బరువు, వ్యాయామం, భావోద్వేగాలు, ఒత్తిడి, గర్భం, దినచర్య వంటి అంశాల ద్వారా దానిని ర్ణయిస్తారు. సాధారణంగా, రక్తపోటు పరిధి వయస్సుతో పెరుగుతుంది. స్త్రీ పురుషుల రక్తపోటు ఒకేలా ఉంటుందా? అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. బాల్యంలో అబ్బాయిలు, అమ్మాయిల రక్తపోటు సమానంగా ఉంటుంది. కానీ యుక్తవయస్సులో అబ్బాయిలు, అమ్మాయిల రక్తపోటు పెరుగుతుంది. సాధారణంగా పురుషుల కంటే మహిళలకు తక్కువ రక్తపోటు ఉంటుంది. కానీ పీరియడ్స్‌ తర్వాత పురుషుల కంటే మహిళల రక్తపోటు పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వయసుల వారీగా బ్లడ్‌ ప్రెజర్ ఎలా ఉండాలంటే..

నవజాత శిశువు నుంచి 6 నెలల వరకు సిస్టోలిక్ రేంజ్ 45–90, డయాస్టొలిక్ రేంజ్ 30–65 ఉంటుంది 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు సిస్టోలిక్ రేంజ్ 80–100, డయాస్టొలిక్ రేంజ్ 40–70 ఉంటుంది పిల్లలు (2–13 సంవత్సరాలు) సిస్టోలిక్ రేంజ్ 80–120, డయాస్టొలిక్ రేంజ్ 40–80 ఉంటుంది కౌమారదశ (14–18 సంవత్సరాలు) సిస్టోలిక్ రేంజ్ 90–120, డయాస్టొలిక్ రేంజ్ 50–80 ఉంటుంది వయోజన (19–40 సంవత్సరాలు) సిస్టోలిక్ రేంజ్ 95–135, డయాస్టొలిక్ రేంజ్ 60–80 ఉంటుంది వయోజన (41–60 సంవత్సరాలు) సిస్టోలిక్ రేంజ్ 110–145, డయాస్టొలిక్ రేంజ్ 70–90 ఉంటుంది పెద్దవారు (61 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) సిస్టోలిక్ రేంజ్ 95–145, 70–90 ఉంటుంది

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.