Viral Video: సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని లాగిపెట్టి కొట్టి.. మరో వివాదంలో ప్రముఖ నటుడు! వీడియో వైరల్
సెల్ఫీ దిగేందుకు వెళ్లిన అభిమానిని నటుడు లాగిపెట్టి కొట్టాడు. అదీ బాలీవుడ్ స్టార్ నటుడు కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఈ వీడియోలో బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ జనాల మధ్యలో నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఇంతలో షూటింగ్ టేక్స్ మధ్య వచ్చిన గ్యాప్‌లో ఆయనతో సెల్ ఫోన్‌లో సెల్ఫీ దిగేందకు ఓ అభిమాని ముచ్చటపడ్డాడు. దీంతో ఆయన వద్దకు వచ్చి సెల్ఫీ దిగుతానని అడుగుతాడు. కానీ నానా పటేకర్..
సెల్ఫీ దిగేందుకు వెళ్లిన అభిమానిని నటుడు లాగిపెట్టి కొట్టాడు. అదీ బాలీవుడ్ స్టార్ నటుడు కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఈ వీడియోలో బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ జనాల మధ్యలో నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఇంతలో షూటింగ్ టేక్స్ మధ్య వచ్చిన గ్యాప్‌లో ఆయనతో సెల్ ఫోన్‌లో సెల్ఫీ దిగేందకు ఓ అభిమాని ముచ్చటపడ్డాడు. దీంతో ఆయన వద్దకు వచ్చి సెల్ఫీ దిగుతానని అడుగుతాడు. కానీ నానా పటేకర్ మాత్రం అతన్ని లాగిపెట్టి కొట్టాడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత సదరు అభిమానిని బౌన్సర్లు మెడపట్టి సెట్ నుంచి బయటికి లాక్కెళ్లడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన వారణాసిలో మంగళవారం జరిగినట్లు సమాచారం. అక్కడ వీధుల్లో జరిగిన షూటింగ్ మధ్యలో ఓ యువకుడు వచ్చి సెల్ఫీ దిగేందుకు యత్నించగా నానాపటేకర్.. సదరు యువకుడిని వెనకనుంచి తలపై కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.
కొందరు నెటిజన్లు నానా పటేకర్ చేసిన పనిని తీవ్రంగా ఖండించారు. సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమానితో ఇలాగేనా ప్రవర్తించేదంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరేమో నానా పటేకర్ చర్యను సమర్థించారు. నటులతో ఫొటో దిగే ముందు వారి అనుమతి తీసుకోవడం మర్యాద. వాళ్లతో బలవంతంగా ఫొటోలు దిగాలని చూస్తే ఇలాగే జరుగుతుందని హితవు పలుకుతున్నారు. ఇది మంచి గుణపాఠం. ఇతరుల ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వాలి. వారి ప్రైవసీని భంగపరచకూడదు. ఇకమీదటైన ఎవరూ ఇలా సెల్ఫీల కోసం ఎగబడకుండా ఉంటారంటూ మరొక యూజర్ కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు.
This time Uday Bhai could not control himself.#nanapatekar#journeyfilmshooting pic.twitter.com/PubwuoQ24M
— Thriller Soundtrack Music (@sandeeprathi100) November 15, 2023
అనిల్ శర్మ కొత్తం చిత్రం ‘జర్నీ’ షూటింగ్‌లో నానా పటేకర్ కూడా పాల్గొన్నారు. గదర్ ఫేమ్ అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ‘జర్నీ’ మువీని.. చిత్తవైకల్యంతో బాధపడుతున్న తండ్రి – బిడ్డల మధ్య భావోద్వేగభరత కథనంతో తెరకెక్కిస్తున్నారు. నానా పటేకర్‌తో పాటు ఈ మువీలో సిమ్రత్ కౌర్ రంధవా, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాల్ బత్తి పేరుతో త్వరలో రాబోతున్న వెబ్‌సిరీస్‌లోనూ నానాపటేకర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా నానా పటేకర్ ఇలా వార్తల్లో నిలవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మీటు ఉద్యమం సమయంలోకూడా పలువురు హీరోయిన్లు నానాపటేకర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. నానా పటేకర్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాడని బహిరంగంగా ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో తీవ్ర దూమారం లేపాయి. తనుశ్రీ దత్తా ఆరోపణలతో పీకల్లోతు వివాదంలో చిక్కున్న నానా పటేకర్, తాజాగా మరో వివాదంతో వార్తల్లో నిలిచాడు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.