AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: ‘గ్లోబల్ స్టార్ కావాలంటే దేశాన్ని ఎందుకు విడిచి వెళ్లాలి ?’.. దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్..

ఇటీవలే షారుఖ్ సరసన పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది దీపికా. ప్రస్తుతం ఆమె కల్కి చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న దీపికా.. ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మోడల్ గా ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు పనిచేశానని..

Deepika Padukone: 'గ్లోబల్ స్టార్ కావాలంటే దేశాన్ని ఎందుకు విడిచి వెళ్లాలి ?'.. దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్..
Deepika Padukone
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2023 | 4:03 PM

Share

భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో దీపికా ఒకరు. హిందీలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే షారుఖ్ సరసన పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది దీపికా. ప్రస్తుతం ఆమె కల్కి చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న దీపికా.. ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మోడల్ గా ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు పనిచేశానని.. లూయీస్ వ్యూటన్ తో పని చేస్తున్న సమయంలో వాళ్ల ఉత్పత్తుల పక్కన తన చిన్న చిన్న ఫోటోస్ పెట్టి సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించుకునేవారని.. తనని ఇన్ఫ్లుయెన్సర్ గా ఉపయోగించుకోవడం నచ్చలేదని తెలిపింది.

అలాగే కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ సభ్యురాలిగా ఫ్రాన్స్ లో అడుగుపెట్టినప్పుడు తన హోర్టింగ్స్ పెట్టారని.. అప్పుడే తొందరపాటు మంచిది కాదనిపించిందని తెలిపింది. దీపికా మాట్లాడుతూ.. ‘మోడల్‏గా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో తనకు మంచి పేరొచ్చింది. ఎన్నో బ్రాండ్ యాడ్స్ చేశానను. ఆ సమయంలో తన ఫ్యాషన్ గురువులంతా ‘నువ్వు ఇక్కడ ఉంటే ఎదగలేవు. ప్యారిస్, న్యూయార్క్, మిలన్ వెళ్లిపో’ అక్కడ బాగా స్థిరపడిపోతావు అని అన్నారు. నాది భారతదేశం. గ్లోబల్ స్టార్ గా ఎదిగేందుకు నేను భారతదేశం ఎందుకు వెళ్లాలి ? అనే సందేహం అప్పటి నుంచి నాలో ఉండిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. కేవలం 21ఏళ్ల వయసులోనే దీపికా ఓం శాంతి ఓం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

View this post on Instagram

A post shared by VOGUE India (@vogueindia)

నెపోటిజం పై కామెంట్స్..

టీనేజ్ లోనే ముంబైలో అడుగుపెట్టానని.. అప్పుడు తనది ఒంటరి ప్రయాణమి.. అర్దరాత్రుళ్ల దాగా పనిచేసి తన లగేజీతో క్యాబ్ లోనే నిద్రపోయేదాన్ని అని తెలిపింది. కానీ అవెప్పుడు తనకు భారంగా, కష్టంలా భావించలేదని తెలిపింది. ఇండస్ట్రీలో నా తల్లిదండ్రులు లేరు. నాకంటూ గాడ్ ఫాదర్స్ లేరు. సినీ కుటుంబంలోని సభ్యులకే అవకాశాలు వచ్చేవి. దీనినే నెపోటిజం అంటున్నారు. అది అప్పుడూ ఉంది.. ఇప్పుడూ ఉంది. ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం ఇది అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by VOGUE India (@vogueindia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.