Tiger 3 Movie: బాక్సాఫీస్‌పై టైగర్ పంజా.. సల్మాన్ మూవీకి రికార్డు వసూళ్లు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
చాలా రోజుల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అతను నటించిన టైగర్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండడమే సల్మాన్ ఆనందానికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన టైగర్ 3 సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సగటు సినీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా సల్మాన్ ఖాన్ అభిమానులకు మాత్రం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాగా నచ్చేసింది
చాలా రోజుల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అతను నటించిన టైగర్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండడమే సల్మాన్ ఆనందానికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన టైగర్ 3 సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సగటు సినీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా సల్మాన్ ఖాన్ అభిమానులకు మాత్రం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాగా నచ్చేసింది. దీంతో సల్లూ భాయ్ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. తొలి మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టిన ‘టైగర్ 3’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ 150 కోట్లకు చేరువలో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సల్మాన్‌ఖాన్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అదే టైగర్ 3 వసూళ్ల వర్షానికి కారణమంటున్నారు. ‘టైగర్ 3’కి తొలిరోజే భారీ ఓపెనింగ్ వచ్చింది. నవంబర్ 12న ఈ సినిమా 44.50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు వసూళ్లు రూ.42.50 కోట్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా మూడు రోజుల్లోనే 145 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన టైగర్ 3 రూ.150 కోట్ల మార్కును అందుకునేందుకు చేరువలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ. 200 కోట్లకు చేరువలో సల్మాన్ మూవీ ఉందని తెలుస్తోంది.
మనీష్ శర్మ తెరకెక్కించిన ‘టైగర్ 3’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెప్పించాడు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో అలరించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. వివిధ దేశాల్లోని పలు లొకేషన్లలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. రిచ్ మేకింగ్ చూసి అభిమానులు వావ్ అంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాఫ్‌లతో సతమతమవుతోన్న సల్మాన్ ఖాన్ కు టైగర్ 3 కలెక్షన్లు భారీ ఊరట ఇచ్చాయని చెప్పుకోవచ్చు.
250 కోట్ల దిశగా…
#Tiger3 ENTERS the elite ₹250 cr club in just 3 days at the WW Box Office.
Yet another DOUBLE century adds to megastar #SalmanKhan career.
Day 1 – ₹ 95.23 cr Day 2 – ₹ 88.16 cr… pic.twitter.com/xck2Y5xvSZ
— Manobala Vijayabalan (@ManobalaV) November 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..