AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దీపావళి పండుగలో అంతులేని విషాదం.. ప్రమిదలే వారిపాలిట చితి మంటలయ్యాయి!

హైదరాబాద్‌లోని మల్కాజిగిరి సమీపంలోని ప్రేంవిజయ్‌నగర్‌ కాలనీలో వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు రాఘవమ్మ (79), రాఘవరావు (82) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో బంధువులున్న అపార్ట్‌మెంట్‌లోనే ఫ్లాట్‌ కొనుక్కొని ఉంటున్నారు. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం బాల్కనీలో ప్రమిదలు వెలిగిస్తుండగా రాఘవమ్మ చీరకు నిప్పంటుకుంది. ఆమె భయంతో బాల్కనీకి ఆనుకుని ఉన్న పడకగదిలోకి పరుగు తీసింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న భర్త గదిలోనే సేద తీరుతున్నారు. ఈ క్రమంలో రాఘవమ్మకు అంటుకున్న మంటలు..

Hyderabad: దీపావళి పండుగలో అంతులేని విషాదం.. ప్రమిదలే వారిపాలిట చితి మంటలయ్యాయి!
Elderly Couple Died In A Fire Accident
Srilakshmi C
|

Updated on: Nov 14, 2023 | 4:37 PM

Share

మల్కాజిగిరి, నవంబర్‌ 14: దీపావళి పండుగ కాంతులు అందరి ఇళ్లల్లో వెలుగులు విరజిమ్మితే ఆ ఇంట్లో మాత్రం అంతులేని విషాదాన్ని నింపాయి. బాల్కనీలో వెలిగించిన ప్రమిదలకు వృద్ధ దంపతులు సజీవంగా ఆహుతయ్యారు. భర్త ఇంటి వద్దనే అగ్నికి ఆహుతై దుర్మరణం పాలయ్యాడు. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని మల్కాజిగిరి సమీపంలోని ప్రేంవిజయ్‌నగర్‌ కాలనీలో వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు రాఘవమ్మ (79), రాఘవరావు (82) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో బంధువులున్న అపార్ట్‌మెంట్‌లోనే ఫ్లాట్‌ కొనుక్కొని ఉంటున్నారు. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం బాల్కనీలో ప్రమిదలు వెలిగిస్తుండగా రాఘవమ్మ చీరకు నిప్పంటుకుంది. ఆమె భయంతో బాల్కనీకి ఆనుకుని ఉన్న పడకగదిలోకి పరుగు తీసింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న భర్త గదిలోనే సేద తీరుతున్నారు. ఈ క్రమంలో రాఘవమ్మకు అంటుకున్న మంటలు భర్త రాఘవరావుకు అంటుకున్నాయి. దీంతో ఆయన మంచంపై నుంచి లేచేలోపే క్షణాల్లో ఒళ్లంతా మంటలు వ్యాపించి అక్కడికక్కడే మృతి చెందాడు. రాఘవమ్మ భయంతో బయటకు పరుగులు తీసింది. ఇంటి చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరీక్షించి రాఘవరావు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన రాఘవమ్మను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. వృద్ధులైన ఆ దంపతులు ఇరువురు ఇలా అగ్నిప్రమాదంలో చనిపోవడం స్థానికులను కలచివేసింది.

నాంఫల్లి అగ్నిప్రమాద ఘటనలో అపార్ట్‌మెంట్‌ యజమానిపై చర్యలు

నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అపార్ట్‌మెంట్ యజమాని రమేశ్‌ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని, అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిల్వ చేసిన రసాయనాల కారణంగా భవనం మొత్తం మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న యజమాని రమేశ్‌ జైస్వాల్‌ ప్రమాదంలో చనిపోయిన వారిని చూసి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డిశ్చార్జ్‌ కాగానే పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే భవనం వద్ద క్లూస్‌ టీమ్‌ నమూనాలు సేకరించింది. అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోగా.. మరో 10 మంది అపస్మారక స్థితికి చేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.