AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kukur Puja: వీధి కుక్కలకు ప్రత్యేక పూజలు! పూలు కుంకుమతో అలంకరించీ..కడుపు నిండా భోజనం పెట్టీ..

దీపావళికి ముందు రోజు అంటే నరక చతుర్దశి రోజున పశ్చిమ బెంగాల్‌లో ఓ విచిత్ర ఆచారాన్ని పాటిస్తారు. అందేంటంటే అక్కడ వీధుల్లో తిరిగే కుక్కలకు చక్కగా స్నానం చేయించి, ధూపనైవేద్యాలతో పూజచేసి మెడలో పూల మాలవేసి పసుపు, కుంకుమతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. జంతు ప్రేమికులు కూడా పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌పూర్‌లోని సిలిగురికి చెందిన ఓ జంట శనివారం మధ్యాహ్నం కుక్కల రెస్క్యూ సెంటర్‌లో ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కుక్కలు మనుషులతో సన్నిహితంగా ఉండే..

Kukur Puja: వీధి కుక్కలకు ప్రత్యేక పూజలు! పూలు కుంకుమతో అలంకరించీ..కడుపు నిండా భోజనం పెట్టీ..
Kukur Tihar Festival
Srilakshmi C
|

Updated on: Nov 12, 2023 | 6:07 PM

Share

పశ్చిమ బెంగాల్‌, నవంబర్‌ 12: దీపావళికి ముందు రోజు అంటే నరక చతుర్దశి రోజున పశ్చిమ బెంగాల్‌లో ఓ విచిత్ర ఆచారాన్ని పాటిస్తారు. అందేంటంటే అక్కడ వీధుల్లో తిరిగే కుక్కలకు చక్కగా స్నానం చేయించి, ధూపనైవేద్యాలతో పూజచేసి మెడలో పూల మాలవేసి పసుపు, కుంకుమతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. జంతు ప్రేమికులు కూడా పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌పూర్‌లోని సిలిగురికి చెందిన ఓ జంట శనివారం మధ్యాహ్నం కుక్కల రెస్క్యూ సెంటర్‌లో ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కుక్కలు మనుషులతో సన్నిహితంగా ఉండే పెంపుడు జంతువులు. వాటిని పూజతో గౌరవించాలని అంటున్నారు.

దీంతో శనివారం అక్కడి వీధి కుక్కలన్నీ క్లీన్ అండ్ నీట్‌గా కనిపించాయి. మెడలో పూల దండ, నుదుటిపై తిలకం పెట్టిన కుక్కలు దర్శనమిచ్చాయి. ఉత్తరాఖండ్‌, నేపాల్ మొదలైన ప్రాంతాల్లోనూ కుక్కలను ఈ విధంగా పూజిస్తారు. ఇలా కుక్కలకు పూజ చేయడాన్ని అక్కడి స్థానికులు కుకుర్‌ పూజ లేదా కుకుర్‌ తీహార్‌ అని పిలుస్తారు. డాగ్ తీహార్ సమయంలో అక్కడ ప్రజలు కుక్కలకు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. మెడలో పూలమాల వేసి, నుదుటిన కుంకుమదిద్ది కుక్కలకు కడుపునిండా భోజనం చెడతారు.

అయితే పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌లో నివసిస్తున్న సంచితా పాల్, పికాసో పాల్ అనే దంపతులకు కుక్కలంటే చాలా ఇష్టం. ఆ ప్రాంతంలోని ప్రజలకు అతను జంతు ప్రేమికుడిగా తెలుసు. శనివారం ఉదయం దంపతులు పలు వీధి కుక్కలను పట్టుకుని మెడలో పూలమాల వేశారు. కుక్కలను పూజించేటప్పుడు తిలకందిద్ది కుక్కలకు తినడానికి, త్రాగడానికి అన్నం, మాంసం మొదలైన ప్రత్యేక ఆహారాలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా కుక్కలను పూజించే సంప్రదాయం ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ ఉంది. కానీ బెంగాల్‌లో ఈ సంప్రదాయం లేదు. కాళీ పూజ సమయంలో అనేక సందర్భాల్లో కుక్కలను హింసించేవారు. కుక్కల తోకలకు బాంబులు, పటాకులు కట్టి పేల్చేవారు. ఇలాంటి ఘటనల్లో చాలా కుక్కులు తీవ్రంగా గాయపడి చనిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కుక్కలకు పూజచేసినట్లు సంచితా పాల్, పికాసో పాల్ దంపతులు తెలిపారు. నేపాల్‌లో డాగ్ తీహార్ పండుగ చాలా ప్రసిద్ధి. పురాణాల ప్రకారం కుక్క మృత్యు దేవుడైన యముడికి ఇష్టమైన జంతువుగా పరిగణించబడుతుంది. అందువల్లనే సిక్కిం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మొదలైన ప్రాంతాలతో పాటు నేపాల్,ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో కుక్కలకు పూజలు చేస్తారు. యముడిని సంతోష పెట్టడానికి డాగ్ తీహార్ జరుపుకుంటామని స్థానికులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.