Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grocery Store: పండగ వేళ కిరాణా దుఖాణంలో దొంగతనం.. సీసీటీవీలో రికార్డైన చోరీ దృశ్యాలు

దీపావళి పండగ సందర్భంగా కిరాణా సరుకులు అమ్మి దుకాణంలో దాచిన డబ్బును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. దొంగ చోరీకి పాల్పడుతున్న వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. దొంగ నల్లటి కండువా ధరించి చోరీకి పాల్పడినట్లు వీడియోల్లో రికార్డయ్యింది. ఇంటి రెండో అంతస్తు నుంచి దుకాణానికి చేరుకున్న అగంతకుడు షాపులోని కిరాణా సామాగ్రి పరిశీలించడం, ఆ తర్వాత షాపు గల్లాపెట్టెలోంచి ఒక్కొక్కటిగా డబ్బు కట్టలు తీసి జేబులో పెట్టుకోవడం ఫుటేజీలో కనిపించింది. చోరీ ఘటనపై దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా..

Grocery Store: పండగ వేళ కిరాణా దుఖాణంలో దొంగతనం.. సీసీటీవీలో రికార్డైన చోరీ దృశ్యాలు
Grocery Store Robbery
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 12, 2023 | 4:38 PM

బీహార్‌, నవంబర్‌ 12: దీపావళి పండగ సందర్భంగా కిరాణా సరుకులు అమ్మి దుకాణంలో దాచిన డబ్బును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. దొంగ చోరీకి పాల్పడుతున్న వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. దొంగ నల్లటి కండువా ధరించి చోరీకి పాల్పడినట్లు వీడియోల్లో రికార్డయ్యింది. ఇంటి రెండో అంతస్తు నుంచి దుకాణానికి చేరుకున్న అగంతకుడు షాపులోని కిరాణా సామాగ్రి పరిశీలించడం, ఆ తర్వాత షాపు గల్లాపెట్టెలోంచి ఒక్కొక్కటిగా డబ్బు కట్టలు తీసి జేబులో పెట్టుకోవడం ఫుటేజీలో కనిపించింది. చోరీ ఘటనపై దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగ కోసం వెతుకులాట ప్రారంభించారు. పండుగల సమయంలో వరుస చోరీలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కిరాణా దుకాణదారుడు సంజీవ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

బీహార్‌లోని వైశాలిలో మహిసౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్‌పూర్ చందే పంచాయితీలోని వార్డు నంబర్ ఐదులోని కిరాణా షాపులో గుర్తు తెలియని దొంగ చోరీకి పాల్పడ్డాడు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో దొంగ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే మహిసౌర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా దుకాణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో దుకాణంలో దొంగ చోరీ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నల్లటి టవల్ ధరించి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది.

ఉదయం దుకాణానికి చేరుకున్న దుకాణదారుడు సంజీవ్‌కుమార్‌ షాపు సరుకులు తీసుకురావడానికి డబ్బును తనిఖీ చేయగా గల్లాపెట్టెలో డబ్బులు కనిపించకపోవడంతో ఆందోళన పడ్డాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి దుకాణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. షాపులో దొంగ చోరీకి పాల్పడుతున్నట్లు దుఖాణం యజమాని సంజీవ్ గుర్తించాడు. గుర్తుతెలియని దొంగ తన దుకాణంలో సుమారు రూ.10 వేల విలువైన నగదు, కొన్ని వస్తువులను అపహరించినట్లు సంజీవ్ పోలీసులకు తెలిపాడు. రాత్రి 2 గంటల సమయంలో పక్కనే ఉన్న 2 అంతస్తుల భవరం నుంచి దొంగ దుఖాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. కిరాణా షాపులో చోరీ జరిగినట్లు సమాచారం అందిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..