India to get Air Taxis: భారత్‌కు వచ్చేస్తోన్న ఎయిర్‌ ట్యాక్సీలు.. ఇకపై 7 నిమిషాల్లోనే ఢిల్లీ-ముంబై ప్రయాణం షురూ

భారత్‌లో ఎయిర్ ట్యాక్సీ సేవలు ఢిల్లీ-ముంబై నుంచి ప్రారంభం కానుంది. ఎయిర్ ట్యాక్సీ సేవలు మొదట ఢిల్లీ నుంచి ప్రారంభమై ముంబై మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది. ఆ తర్వాత మరో నగరంలో దీని సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సర్వీస్‌ను ఆన్-రోడ్ ధరతో సరిపోల్చనున్నామని, తద్వారా ఎక్కువ మంది ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చని రెండు కంపెనీలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రోడ్డు మార్గంలో ప్రయాణించే దూరాన్ని గరిష్టంగా తగ్గించనుంది..

India to get Air Taxis: భారత్‌కు వచ్చేస్తోన్న ఎయిర్‌ ట్యాక్సీలు.. ఇకపై 7 నిమిషాల్లోనే ఢిల్లీ-ముంబై ప్రయాణం షురూ
Air Taxi
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 12, 2023 | 4:10 PM

న్యూఢిల్లీ, నవంబర్ 12: ప్రముఖ దేశీయ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజ్, అమెరికన్ స్టార్టప్ ఆర్చర్ ఏవియేషన్‌తో కలిసి 2026 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఈ ఇంటర్‌గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజ్‌ అనుబంధ సంస్థ దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ప్రయాణీకులను చేరవేసే దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ సర్వీస్ ఇండిగోను నిర్వహిస్తోంది.

ఆర్చర్ ఏవియేషన్ గత నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో అమెరికాలో తన మొదటి ఒప్పందంపై సంతకం చేసింది. భారత్ ఇది రెండో ఒప్పందం. ఈ విధంగా 2026 నాటికి UAE, భారత్‌లో ఏకకాలంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.

భారత్‌లో ఎయిర్ ట్యాక్సీ సేవలు ఢిల్లీ-ముంబై నుంచి ప్రారంభం కానుంది. ఎయిర్ ట్యాక్సీ సేవలు మొదట ఢిల్లీ నుంచి ప్రారంభమై ముంబై మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది. ఆ తర్వాత మరో నగరంలో దీని సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సర్వీస్‌ను ఆన్-రోడ్ ధరతో సరిపోల్చనున్నామని, తద్వారా ఎక్కువ మంది ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చని రెండు కంపెనీలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రోడ్డు మార్గంలో ప్రయాణించే దూరాన్ని గరిష్టంగా తగ్గించనుంది. 60 నుండి 90 నిమిషాల ప్రయాణ సమయాన్ని ఏడు-ఎనిమిది నిమిషాలకు తగ్గించనుంది. పైగా ట్రాఫిక్‌ జామ్ నుంచి విముక్తితోపాటు, ప్రజల సమయం కూడా ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి

నిలువుగా ల్యాండింగ్

ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాలను ఆర్చర్ ఏవియేషన్ తయారు చేస్తుంది. ఈ విమానాలు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. ఈ ఎయిర్ టాక్సీ పైలట్‌తో సహా ఐదుగురు వ్యక్తులతో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రెండు వందల ఎయిర్ ట్యాక్సీలతో భారత్‌లో ఈ సర్వీసును ప్రారంభించాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. చార్టర్, లాజిస్టిక్స్, మెడికల్ ఎమర్జెన్సీ మొదలైన వాటికి కూడా వీటిని ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.

బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో తొలిసారిగా ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ టాక్సీ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ టాక్సీలో రెండు క్వింటాళ్ల లగేజీని కూడా తీసుకెళ్లవచ్చు. దీంతో భారత్‌లో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించడంపై చర్చలు మొదలయ్యాయి.

గత నెలలో ఎయిర్ టాక్సీ కార్యకలాపాలకు చైనా అనుమతి ఇచ్చింది. ఎహాంగ్ అనే కంపెనీకి ఎయిర్‌టాక్సీ నడిపేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రెండు-సీట్ల ఎయిర్ టాక్సీ కేంద్రీకృత కమాండ్ ద్వారా నిర్వహించబడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 128 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని ఒకసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీన్ని గంటకు రెండు వందల కిలోమీటర్లకు పెంచేందుకు చైనా కసరత్తు చేస్తోంది. 2024 ఒలింపిక్ క్రీడలకు ఫ్రాన్స్‌ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రీడల సందర్భంగా ఫ్రాన్స్‌ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని ప్రారంభించాలని పేర్కొంది. ప్రారంభ దశలో ఇది పారిస్‌కు చెందిన ఎయిర్ టెర్మినల్స్ మధ్య ఉపయోగించబడుతుంది. తర్వాత వైద్య అవసరాలకు వినియోగించే యోచనలో ఉన్నారు. ఇది కూడా రెండు సీట్ల ఎయిర్ టాక్సీ. ఇందులో ఒక పైలట్, ఒక ప్రయాణీకుడు ప్రయాణించడానికి వీలుంటుంది. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు ఇంకా ప్రారంభ దశలోనే కొనసాగుతోందని చెప్పవచ్చు. ప్రపంచంలోని అనేక నగరాల్లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఆకాశంలో ఎగురుతాయనే విషయం సృష్టమవుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.