Darlyn Morais: సాలీడు కాటుకు ప్రముఖ సింగర్ మృతి.. సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల సంతాపం

సాలీడు కాటుకు చెందిన ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్‌కు సింగర్ డార్లిన్ మోరైస్ (28) ముఖంపై ఇటీవల సాలీడు కాటేసింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మోరైస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మోరైస్‌ ముఖంపై సాలీడు కుట్టడంతో, ఆ చోట నలుపు రంగులోకి మారిపోయిందని, ఆ తర్వాత చికిత్స ద్వారా తన భర్తను బ్రతికించుకోవడానికి ప్రయత్నించినట్లు మృతుడి భార్య జులినీ లిస్బోవా (Jhullenny Lisboa) తెలిపింది. అయితే చికిత్స అనంతరం

Darlyn Morais: సాలీడు కాటుకు ప్రముఖ సింగర్ మృతి.. సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల సంతాపం
Brazilian Singer Darlyn Morais
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 09, 2023 | 8:07 PM

బ్రసీలియా, నవంబర్‌ 9: సాలీడు కాటుకు చెందిన ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్‌కు సింగర్ డార్లిన్ మోరైస్ (28) ముఖంపై ఇటీవల సాలీడు కాటేసింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మోరైస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మోరైస్‌ ముఖంపై సాలీడు కుట్టడంతో, ఆ చోట నలుపు రంగులోకి మారిపోయిందని, ఆ తర్వాత చికిత్స ద్వారా తన భర్తను బ్రతికించుకోవడానికి ప్రయత్నించినట్లు మృతుడి భార్య జులినీ లిస్బోవా (Jhullenny Lisboa) తెలిపింది. అయితే చికిత్స అనంతరం నవంబర్ 3వ తేదీ (శుక్రవారం) డిశ్చర్జి కూడా చేశారు. అయినా అతని పరిస్థితి మెరుగుపడకతో ఆ మరుపటి రోజే (ఆదివారం) పాల్మాస్ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు మోరైస్ భార్య జులినీ లిస్బోవా వెల్లడించారు.

మోరైస్ భార్య జులినీ లిస్బోవా మాట్లాడుతూ.. సాలీడు కుట్టిన వెంటనే మోరైస్‌ శరీరంలో నిస్సత్తువ ఆవహించింది. ఆ తర్వాత ముఖం ఉబ్బిపోయింది. గాయం కూడా నల్లగా మారిపోయి అలర్జీ వచ్చింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఈనెల 3వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ మోరైస్ పరిస్థితి మెరుగు కాకపోవడంతో తిరిగి ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించాము. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. మోరైస్ స్టెప్‌ మదర్‌ కూతురు (18) ని కూడా సాలీడు కుట్టింది. ఆమె పాదాలపై సాలీడు కాటు వేసింది. ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జులినీ మీడియాకు తెలిపింది. దీనిపై మోరైస్‌ కుటుంబం ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘ఇటువంటి బాధాకరమైన ఈ సమయంలో మీ మద్దతునిచ్చినందుకు డైలాన్ మరైస్ కుటుంబం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మీ అందరి ప్రేమకు మరోసారి కృతజ్ఞత తెలుపుతున్నా’మని ఇన్‌స్టా పోస్టులో తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా మోరైస్‌ 15 ఏండ్ల వయస్సులో గాయకుడిగా తన కెరీర్‌ ప్రారంభించాడు. తనదైన స్టయిల్‌తో ఒక బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తన సోదరుడు, స్నేహితుడితో కూడిన ముగ్గురు సభ్యుల బ్యాండ్‌.. టోకాంటిన్స్, గోయాస్, మారన్‌హావో, పారా రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపాడు. మోరైస్‌ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నలుగురికి సాయం చేసే వ్యక్తిత్వం కలిగిన వాడని అతని సమీప బంధువు వెస్లెయా సిల్వా చెబుతూ కన్నీటి పర్యాంతమయ్యాడు. ఈ సందర్భంగా మోరైస్ సన్నిహితులు, అభిమానులు అతనికి నివాళులు అర్పించారు. ఇక సింగర్‌ మోరైస్ మరణానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు బ్రెజిల్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.