పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని సహజమైన మార్గంలో నిర్విషీకరణ చేస్తాయి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో పసుపును ఈ కింది మార్గాల్లో చేర్చుకోవచ్చు. పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగొచ్చు. పసుపు పాలలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. అంతేకాకుండా, పసుపు-పాలు శరీరం నుంచి హానికారక విషాలను తొలగిస్తుంది. పాలు మరిగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. తాగేటప్పుడు స్పూన్ తేనె కలుపుకుంటే సరిపోతుంది.