- Telugu News Photo Gallery Are you getting cramps in your legs and arms? Be careful, Check here is details in Telugu
Cramps Facts: కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు బాగా వస్తున్నాయా.. అయితే కారణం ఇదే!
సాధారణంగా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు అనేవి సర్వ సాధారణంగా అందరికీ వస్తూంటాయి. ఎక్కువ సేపు కూర్చున్నా.. నిల్చున్నా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. నరాలపై ఎక్కువగా ఒత్తిడి పడటం వల్ల ఇలా తిమ్మిర్లు అనేవి రావడం కామన్. ఇలా వచ్చిన తిమ్మిర్లు కొందరిలో వెంటనే వాటంతట అవే తగ్గిపోతాయి. అలా కాకుండా కొందరిలో తరచూ వస్తే మాత్రం.. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తిమ్మిర్లు రావడానికి వెనుక అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయని గమనించాలి. మాటిమాటికీ తిమ్మిర్లు వస్తే మాత్రం..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 08, 2023 | 8:40 PM

సాధారణంగా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు అనేవి సర్వ సాధారణంగా అందరికీ వస్తూంటాయి. ఎక్కువ సేపు కూర్చున్నా.. నిల్చున్నా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. నరాలపై ఎక్కువగా ఒత్తిడి పడటం వల్ల ఇలా తిమ్మిర్లు అనేవి రావడం కామన్. ఇలా వచ్చిన తిమ్మిర్లు కొందరిలో వెంటనే వాటంతట అవే తగ్గిపోతాయి. అలా కాకుండా కొందరిలో తరచూ వస్తే మాత్రం.. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

తిమ్మిర్లు రావడానికి వెనుక అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయని గమనించాలి. మాటిమాటికీ తిమ్మిర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా వైద్యుడ్ని సంప్రదించాలి. తరచూ తిమ్మిర్లు రావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నా కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. రకత్ంలో ఉండే షుగర్ లెవల్స్.. నరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అలాగే వెన్నుముకలో జారిన డిస్క్ కాళ్ల నరాలపై ఒత్తిడి చేయడం వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి.

అదే విధంగా అర్థరైటీస్, రుమటాయిడ్, ల్యూపస్ వంటి వ్యాధులతో బాధ పడే వారిలో కూడా తిమ్మిర్లు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే విటమిన్లు బి, ఇలు లోపించినా ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. హైపటైటిస్ ఇన్ ఫెక్షన్ లతో బాధ పడే వారిలో కూడా నరాల ఆరోగ్యం దెబ్బతింటుంది.

అంతే కాకుండా మూత్ర పిండాలు, థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో కూడా తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. ఇలా తరచూ తిమ్మిర్లు రావడం వెనక అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి తిమ్మిర్లు వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం మేలు.





























