- Telugu News Photo Gallery Do you smell sweat after taking a bath? Follow these tips, check here is details
Sweat Relief Tips: స్నానం చేసినా చెమట వాసన వస్తోందా.. ఇలా ఉపశమనం పొందండి!
సాధారణంగా ఎవరికైనా చెమటలు పట్టడం కామన్ విషయం. చెమటలు ఎక్కువగా వేసవి కాలంలోనే పడతాయి. ఆ తర్వాత ఒక్కోసారి బయటకు పని మీద వెళ్లినప్పుడు కూడా ఉక్కపోతకు చెమటలు పడుతూంటాయి. ఒక్కోసారి మనం వేసుకున్న డ్రెస్ కూడా తడిచి పోతూ ఉంటుంది. అలాగే స్నానం చేసినా కూడా ఒక్కోసారి చెమట ఎక్కువగా పట్టి.. చెమట వాసన అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మసాలా ఎక్కువగా ఉండే వంటలు, ఫాస్ట్ ఫుడ్..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 08, 2023 | 8:40 PM

సాధారణంగా ఎవరికైనా చెమటలు పట్టడం కామన్ విషయం. చెమటలు ఎక్కువగా వేసవి కాలంలోనే పడతాయి. ఆ తర్వాత ఒక్కోసారి బయటకు పని మీద వెళ్లినప్పుడు కూడా ఉక్కపోతకు చెమటలు పడుతూంటాయి. ఒక్కోసారి మనం వేసుకున్న డ్రెస్ కూడా తడిచి పోతూ ఉంటుంది. అలాగే స్నానం చేసినా కూడా ఒక్కోసారి చెమట ఎక్కువగా పట్టి.. చెమట వాసన అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.

మసాలా ఎక్కువగా ఉండే వంటలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, చిరుతిళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, క్యాలీ ఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లి పాయ వంటి పదార్థాలు శరీర దుర్వాసనకు ప్రధాన కారణంగా చెప్తారు. చెమట ఎక్కువగా పట్టే వారు వేపుళ్లు వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. చెమట పట్టే వారు ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. లేదంటే డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది.

ఎక్కువ మందికి అండర్ ఆమ్స్ లోనే చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో బట్టలు కూడా చెమట వాసన వస్తాయి. పక్కన ఉన్న వారికి కూడా ఈ వాసన వస్తుంది. ఈ కారణంగా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు.

చెమట ఎక్కువగా పట్టే చోట ట్రీట్రీ ఆయిల్ తో తుడుచుకుంటే చెమట, దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దుర్వాసరకు కారణం అయ్యే బ్యాక్టీరియాను తొలగించేందుకు యాంటీ సెప్టిక్స్ ఉపయోగించాలి. స్నానం చేసిన తర్వాత అండర్ ఆమ్స్ లో టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి. వీటి వల్ల బాడీ రీ ఫ్రెఫ్ గా ఉంటుంది.

దుస్తులు క్లీన్ చేసేటప్పుడు వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగించాలి. వెనిగర్ వాసన నచ్చకపోతే.. ఇప్పుడు వచ్చే కంఫర్ట్ వంటి వాటిని ఉపయోగించవచ్చు. అలాగే ప్రస్తుతం వాడుతున్న సబ్బుకు బదులు. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును ఉపయోగించడండి. ఇలా చేస్తూ ఉంటే చెమట పట్టినా వాసన రాకుండా ఉంటుంది.





























