- Telugu News Photo Gallery Winter Hair Care: These Simple Early Winter Hair Care Tips You Must Follow From Now
Hair Care Tips: చలికాలంలో జుట్టు పొడిబారి గడ్డిలా మారిందా? ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి..
చలికాలం జుట్టు సమస్యలు పొంచి ఉంటాయి. డ్రై-రఫ్ హెయిర్, హెయిర్ ఫాల్, చుండ్రు..వంటి సమస్యలు ఈ కాలంలో పెరుగుతాయి. శీతాకాలంలో జుట్టు తేమ తగ్గి పొడిబారుతుంది. ఫలితంగా జుట్టు గరుకుగా కనిపిస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. చుండ్రుతో పాటు మాడు జిగటగా, దురదగా అనిపిస్తుంది. చలికాలంలో చుండ్రు, ఫ్లైవేస్ సమస్యలు పెరుగకుండా ఉండాలంటే కొన్ని జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా లోపలి నుంచి జుట్టును..
Updated on: Nov 08, 2023 | 8:37 PM

చలికాలం జుట్టు సమస్యలు పొంచి ఉంటాయి. డ్రై-రఫ్ హెయిర్, హెయిర్ ఫాల్, చుండ్రు..వంటి సమస్యలు ఈ కాలంలో పెరుగుతాయి. శీతాకాలంలో జుట్టు తేమ తగ్గి పొడిబారుతుంది. ఫలితంగా జుట్టు గరుకుగా కనిపిస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. చుండ్రుతో పాటు మాడు జిగటగా, దురదగా అనిపిస్తుంది.


జుట్టుకు నూనె రాయడం వల్ల అనేక సమస్యలను తక్షణం పరిష్కరించవచ్చు. తల స్నానం ముందు తలకు కొబ్బరి నూనె లేదా ఇతర ఆయుర్వేద, మూలికా నూనె ఏదైనా జుట్టుకు రాసుకోవాలి. ఇది జుట్టుకు పోషణ, తేమను అందిస్తుంది.

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాస్తే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అనేక జుట్టు సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ రోజూ జుట్టుకు ఆయిల్ పూసుకోవడం చాలా మందికి కుదరదు. అందుకే చాలా మంది తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె పూసుకుంటారు. షాంపూ చేసే ముందు నూనె రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో నిపుణుల మాటల్లో మీకోసం.. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు క్యూటికల్‌ను స్మూత్ చేస్తుంది. చలికాలంలో డ్రై హెయిర్ సమస్య సర్వసాధారణం. కానీ జుట్టుకు నూనె రాసుకోవడం ద్వారా ఈ సమస్య సులభంగా తొలగిపోతుంది.

పుల్లని పెరుగును, తేనె, ఆలివ్ నూనె కలిపి ఇంట్లోనే సులువుగా సహజపద్ధతుల్లో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. అందులో విటమిన్ ఇ క్యాప్సిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. దీనిని 20-30 నిమిషాలు ఉంచుకుని, ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు పోషణ, తేమను అందిస్తుంది.





























