- Telugu News Photo Gallery Spirituality Tips: Seeing these creatures on the day of Diwali festival is very auspicious
Spirituality Tips: దీపావళి పండుగ రోజు ఈ జీవుల్ని చూస్తే చాలా శుభప్రదమట!
దీపావళి పండుగను భారత దేశమంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు. కుల, మతం అనే విభేదాలు లేకుండా దీపావళి పండుగను చేసుకుంటారు. చిన్న పిల్లలకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. అయితే అదృష్టం వరించే ముందు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయట. అంటే దీపావళి రోజు కొన్ని రకాల జీవుల్ని..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 08, 2023 | 8:55 PM

దీపావళి పండుగను భారత దేశమంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు. కుల, మతం అనే విభేదాలు లేకుండా దీపావళి పండుగను చేసుకుంటారు. చిన్న పిల్లలకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీపావళి వేసందడి మొదలైంది. దీపావళి అంటే తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిపి ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ పండుగలో ఒక్కోరోజు ఒక్కో ప్రాముఖ్యత, గుర్తింపు కలిగి ఉంది. దీపావళి వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడు ఆరాధనకు అంకితం చేయబడింది.ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ వివిధ దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ధన్ తేరాస్ రోజు నుండి షాపింగ్ తో పండగ ప్రారంభమవుతుంది.. యమ ద్వితీయతో ముగుస్తుంది. ఈ ఐదు రోజులూ సర్వత్రా భక్తి, సంతోషాల వాతావరణం నెలకొంటుంది. అయితే పండగ సన్నాహాలు చాలా రోజుల ముందుగానే చేసుకుంటారు. ఈ పండగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

బల్లులు: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవిని ప్రార్థించిన తర్వాత బల్లిని చూడటాన్ని శుభ ప్రదంగా, పవిత్రంగా భావిస్తారు.

పిల్లి: అసలు పిల్లి కనిపిస్తేనే.. ఛీ ఛీ అని తరిమేస్తూంటారు. కానీ శకున శాస్త్రం ప్రకారం ఇంట్లోకి పిల్లి రావడం చాలా మంచిదట. దీపావళి రోజు పిల్లిని చూస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీన్ని లక్ష్మీ దేవి రాకకు సంకేతంగా చెబుతారు నిపుణులు.

చీమలు: దీపావళి పండుగ రోజు ఇంట్లో నల్ల చీమలు చూడటం కూడా శుభ సూచికమే. ఇంట్లో బంగారు వస్తువుల పెట్టిన చోట.. నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మీ సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంటి పై కప్పు నుంచి చీమలు బయటకు వెళ్తే.. ఆకస్మిక డబ్బు కలుగుతుందని భావించాలి.





























