Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardiac Arrest: పరుగు రేసులో పాల్గొని గుండెపోటుతో 14 ఏళ్ల బాలుడు మృతి.. ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు గుండె పోటుకు గురవుతున్నారు. స్కూల్‌ విద్యార్ధుల నుంచి యువకులు, మధ్య వయస్కులు సైతం గుండె పోటుతో మృతి చెందుతున్నారు. డ్యాన్స్‌ చేస్తూ, నడుస్తూ, జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ.. ఇలా ఏ పని చేస్తున్నా గుండె లయ తప్పుతోంది. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో 14 ఏళ్ల బాలుడు గుండె పోటుతో మృతి చెందాడు. స్కూల్‌లో నిర్వహించిన 5 కే పరుగు పందెంలో పాల్గొన్న బాలుడు ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే..

Cardiac Arrest: పరుగు రేసులో పాల్గొని గుండెపోటుతో 14 ఏళ్ల బాలుడు మృతి.. ఎక్కడంటే..
14 Year Old Boy Dies Of Cardiac Arrest
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 08, 2023 | 3:42 PM

ఫ్లోరిడా, నవంబర్ 11: ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు గుండె పోటుకు గురవుతున్నారు. స్కూల్‌ విద్యార్ధుల నుంచి యువకులు, మధ్య వయస్కులు సైతం గుండె పోటుతో మృతి చెందుతున్నారు. డ్యాన్స్‌ చేస్తూ, నడుస్తూ, జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ.. ఇలా ఏ పని చేస్తున్నా గుండె లయ తప్పుతోంది. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో 14 ఏళ్ల బాలుడు గుండె పోటుతో మృతి చెందాడు. స్కూల్‌లో నిర్వహించిన 5 కే పరుగు పందెంలో పాల్గొన్న బాలుడు ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే కుప్పకూలి పోయాడు. వెంటనే స్కూల్ యాజమన్యం సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ టీం బాలుడిని కాపాడేందుక చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

ఫ్లోరిడాలోని మిరామార్‌లోని డేవిస్ వెస్ట్రన్ హైస్కూల్‌లో చదువుతున్న బాలుడు నవంబర్ 4వ తేదీన నిర్వహించిన జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ డ్రిల్ లో పాల్గొన్నాడు. అక్కడ 5కే రన్నింగ్‌ రేసులో పాల్గొని ప్రాణాల మీదక తెచ్చుకున్నాడు. బాలుడు మెమోరియల్ మిరామార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతి చెందిన బాలుడి తల్లి జూలీకి ఇటీవలే క్యాన్సర్ వ్యాధి సోకింది. ఆమె చికిత్స కోసం కుటుంబం మొత్తం పోరాడుతోంది. ఇంతలో బాలుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. బాలుడి తల్లిదండ్రులు కెవిన్‌, జూలీలకు వారి ఫ్యామిలీ స్నేహితుడు గోఫండ్ మి క్యాంపెయిన్ చేపట్టగా అంత్యక్రియల నిర్వహణకు 66 వేల డాలర్టు సమకూరాయి. ఇక బాలుడి మృతి పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా కొన్ని నెలల క్రితం అమెరికాలో 17 ఏళ్ల బాస్కెట్ ప్లేయర్ టీమ్‌తో కలిసి వర్క్ అవుట్ చూస్తూ కుప్పకూలిపోయాడు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ పలువురు గుండెపోటుకు గురైన ఘటనలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అసలు కార్డియాక్ అరెస్ట్ ఎందుకు సంభవిస్తుందంటే.. ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ప్రతి గంటకు ఒక పిల్లవాడు కార్డియాక్ అరెస్ట్‌కు గురవుతున్నట్లు TODAY.com నివేదించింది. ఇది యువకులలో ఎక్కువగా సంభవించడం విచారకరం. యువ అథ్లెట్లలో మరణాలకు కూడా కార్డియాక్ అరెస్ట్ ప్రధాన కారణం. అనేక సందర్భాల్లో CPR, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్‌ని ఉపయోగించడం వలన కార్డియాక్ అరెస్ట్‌ బాధితుల ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఏటా దాదాపు 200 మంది పిల్లలలో ఆకస్మిక గుండె సంబంధిత మరణం సంభవిస్తుందని చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మేఘన్ ఇ టోజీ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.