AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్య బాబోయ్‌..అది గది కాదు భూతల స్వర్గం.. ఒక్క రాత్రికి రూ.83 లక్షలు..! భారతీయ నటి రీల్స్ వైరల్

ఇక్కడ ఒకే సూట్‌లో విలాసవంతమైన సౌకర్యాలతో 4 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. స్టీమ్ బాత్ సౌకర్యాలతో 4 బాత్‌రూమ్‌లు కూడా ఉన్నాయని అలన్న పాండే వివరించారు. మరో విశేషం ఏమిటంటే 12-సీటర్ డైనింగ్ రూమ్/కాన్ఫరెన్స్ రూమ్. ఇండోర్, అవుట్‌డోర్ కిచెన్‌లు కూడా ఈ సూట్ ఆకర్షణను పెంచుతాయి. సూట్‌లో పెద్ద సినిమా థియేటర్, ప్రైవేట్ బార్, గేమ్ రూమ్, లైబ్రరీ, ఆఫీస్ సిస్టమ్, మరెన్నో ఇక్కడ అలరించేందుకు ఉన్నాయి.

అయ్య బాబోయ్‌..అది గది కాదు భూతల స్వర్గం.. ఒక్క రాత్రికి రూ.83 లక్షలు..! భారతీయ నటి రీల్స్ వైరల్
World Most Expensive Hotel
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 08, 2023 | 1:29 PM

హోటల్ సూట్‌లో ఒక్క రాత్రి బసకు అక్షరాల 83 లక్షల రూపాయలు..! ఇది వింటే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. నమ్మశక్యంగా లేదంటూ కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు. కానీ మీరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్ తెలిస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. కాదు కాదు కంగుతింటారు..బిక్కముఖంతో గుడ్లు తేలేస్తారంటే కూడా ఆశ్చర్యపోయేది లేదు. బాలీవుడ్ తార అనన్య పాండే కజిన్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అలన్నా పాండే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్ వీడియోతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ హోటల్ సూట్‌లో ఒక్క రాత్రికి లక్ష డాలర్లు ఖర్చవుతుందని అలన్నా పాండే వీడియోలో వివరించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 83 లక్షల రూపాయలు.

దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయల్‌లో ఒక రోజు బసకు ఇంత ఖర్చు అవుతుంది. అట్లాంటిస్ ది రాయల్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయని అలన్నా పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో స్పష్టంగా ఉంది. బాలీవుడ్ స్టార్ అనన్య పాండే ఈ హోటల్‌లో బస చేసిన వివరాలను అలన్నా పాండే తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా పంచుకున్నారు. దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయల్ ఈ ఏడాది జనవరిలో పర్యాటకుల కోసం ప్రారంభించబడింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ఒకే సూట్‌లో విలాసవంతమైన సౌకర్యాలతో 4 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. స్టీమ్ బాత్ సౌకర్యాలతో 4 బాత్‌రూమ్‌లు కూడా ఉన్నాయని అలన్న పాండే వివరించారు. మరో విశేషం ఏమిటంటే 12-సీటర్ డైనింగ్ రూమ్/కాన్ఫరెన్స్ రూమ్. ఇండోర్, అవుట్‌డోర్ కిచెన్‌లు కూడా ఈ సూట్ ఆకర్షణను పెంచుతాయి. సూట్‌లో పెద్ద సినిమా థియేటర్, ప్రైవేట్ బార్, గేమ్ రూమ్, లైబ్రరీ, ఆఫీస్ సిస్టమ్, మరెన్నో ఇక్కడ అలరించేందుకు ఉన్నాయి. అట్లాంటిస్ ది రాయల్ 10-సీటర్ అరేబియా-స్టైల్ సన్‌కెన్ మజ్లిస్, ఉష్ణోగ్రత-నియంత్రిత ఇన్ఫినిటీ పూల్, 360-డిగ్రీల వీక్షణలతో దుబాయ్ విస్తారమైన స్కైలైన్‌కు ఎదురుగా ప్రైవేట్ టెర్రస్‌లను కలిగి ఉంది. వివరాలు వినడం కంటే వీడియో ద్వారా చూడటం చాలా అందంగా ఉంటుంది. అలన్నా పాండే రీల్‌లో, అనన్య పాండే స్వయంగా అట్లాంటిస్ ది రాయల్ ఆకర్షణను వెదజల్లుతుంది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు సైతం విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదైన హోటల్‌ బస అంటే, అదృష్టం ఉండాల్సిందేనంటున్నారు. ఇంకా ఎంతో మంది నెటిజన్లు తమ అభిప్రాయాలు, కామెంట్లను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..