పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ మహిళ.. ఇన్విజిలేటర్ చొక్కా పట్టుకుని జాడించేసింది.. వీడియో చూడాల్సిందే..
న్విజిలేటర్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లాగేసుకోవడంతో మహిళకు పట్టరాని కోపం వస్తుంది. ఇన్విజిలేటర్ లాగేసుకున్న జవాబు పత్రాన్ని పట్టుకుని తిరిగి తీసుకోవటానికి ప్రయత్నిస్తోంది. కానీ, ఇన్విజిలేటర్ ఆ ఎగ్జామ్ షీట్‌ని వదలటం లేదు. ఈ క్రమంలోనే మహిళ తనను తాను మర్చిపోయింది.. తను ఎక్కడున్నానో కూడా మర్చిపోయింది..ఏకంగా ఇన్విజిలేటర్ చొక్కా లాగి, అతన్ని నెట్టివేసి కొట్టింది. ఇదంతా చూసి ఎగ్జామ్ హాలులో ఉన్నవారంతా ..
ఎగ్జామ్స్ టైమ్‌లో విద్యార్థులు చదువుకోకపోవడం, లేదంటే చదుకోవడానికి సమయం లేకపోవడంతో వారు తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. దీంతో పరీక్షల్లో కాపీ చేయడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇక విద్యార్థులు కాపీ కొట్టడం చూస్తే ఆ ఉపాధ్యాయులు వారి నుంచి ఎగ్జామ్ షీట్ లాగేసుకోవటం, ఒక్కోసారి పరీక్ష లు రాయనివ్వకుండా చేయటం, లేదంటే మరోమారు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేయటం చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరీక్షలో కాపీ చేస్తున్న మహిళను ఇన్విజిలేటర్ పట్టుకుని, ఆమె పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇది చూసిన మహిళ కోపంతో సూపర్‌వైజర్‌పైనే దాడికి దిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
ఈ వైరల్ వీడియో పరీక్ష హాల్‌కి సంబంధించినది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అక్కడ పరీక్ష రాస్తున్నారు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక ఇన్విజిలేటర్ కాపీ చేస్తున్న మహిళను పట్టుకుని ఆమె జవాబు పత్రాన్ని లాగేసుకున్నాడు. దాంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై పరీక్ష హాలులోనే అందరి ముందు ఇన్విజిలేటర్‌తో గట్టిగా వాగ్వాదానికి దిగింది. ఈ గొడవలో ఆ మహిళ తనను తాను మరిచిపోయి సూపర్‌వైజర్ చొక్కా పట్టుకుని చడామడా వాయించేసింది. ఎగ్జామ్ సెంటర్‌లో మహిళా అభ్యర్థురాలు ఇన్విజిలేటర్‌తో ఎలా దురుసుగా ప్రవర్తించిందో ఒక్కసారి వీడియో చూడండి…
వైరల్ వీడియోలో చూసినట్లుగా ఇన్విజిలేటర్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లాగేసుకోవడంతో మహిళకు పట్టరాని కోపం వస్తుంది. ఇన్విజిలేటర్ లాగేసుకున్న జవాబు పత్రాన్ని పట్టుకుని తిరిగి తీసుకోవటానికి ప్రయత్నిస్తోంది. కానీ, ఇన్విజిలేటర్ ఆ ఎగ్జామ్ షీట్‌ని వదలటం లేదు. ఈ క్రమంలోనే మహిళ తనను తాను మర్చిపోయింది.. తను ఎక్కడున్నానో కూడా మర్చిపోయింది..ఏకంగా ఇన్విజిలేటర్ చొక్కా లాగి, అతన్ని నెట్టివేసి కొట్టింది. ఇదంతా చూసి ఎగ్జామ్ హాలులో ఉన్నవారంతా ఇన్విజిలేటర్, మహిళ చుట్టూ గుమిగూడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Kalesh b/w a Invigilator and A woman over he stopped her from cheating in Exam Bihar pic.twitter.com/nZqGS145UB
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2023
పరీక్ష కోసం తరగతి గదిలో గుమిగూడిన వారిలో ఒకరు కూడా పోలీసులను పిలవండి అంటూ గట్టిగట్టిగా అరుస్తుండటం కూడా కనిపించింది. అందరూ మహిళకు సర్ధి చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ ఆ మహిళ కోపం చల్లారినట్లు లేదు. ఈ వీడియో X (Twitter) ఖాతా @gharkekalesh నుండి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..