Vitamin D Deficiency: ఈ లక్షణాలు మీకుంటే విటమిన్ డి లోపం ఉన్నట్లే..కారణాలు, ఆహార వనరులు తెలుసుకోండి

ఒంటిపై దద్దుర్లు, మొటిమలు రావడం, వృద్ధాప్య చాయలు, తరచుగా చర్మం పగిలిపోయినట్టుగా మారటం వంటి అనేకరకాల సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా విటమిన్-డి లోపం ఉందని గుర్తించి, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటుగా, ఉదయం పూట సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోండి. సూర్యరశ్మి మన శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. విటమిన్-డి లోపాన్ని నివారిస్తే అనారోగ్య బాధల నుండి బయట పడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Vitamin D Deficiency: ఈ లక్షణాలు మీకుంటే విటమిన్ డి లోపం ఉన్నట్లే..కారణాలు, ఆహార వనరులు తెలుసుకోండి
Vitamin D
Follow us

|

Updated on: Nov 08, 2023 | 11:45 AM

శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోవడం ఎముక, కండరాల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఆహారం నుండి కాల్షియంను శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది. ఒకరి మానసిక మరియు శారీరక శ్రేయస్సుకు విటమిన్ డి ముఖ్యమైనది. శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోవడం ఎముక, కండరాల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నాడీ వ్యవస్థ, మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థలో విటమిన్ డి కూడా పాత్ర పోషిస్తుంది. పెద్దవారిలో విటమిన్ డి లోపం లక్షణాలు అలసట, ఎముక నొప్పి, జుట్టు రాలడం, కండరాల బలహీనత, కండరాల నొప్పి, డిప్రెషన్ వంటి మూడ్ మార్పులు కనిపిస్తాయి.

విటమిన్ డి లోపానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆహారం లేదా సూర్యరశ్మి లేకపోవడం ద్వారా తగినంత విటమిన్ డి పొందలేకపోతారు. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో వివిధ పరిస్థితులు ఏర్పడతాయి. విటమిన్ డి లోపం ఎముక లోపాలు, తరచుగా అనారోగ్యాలు, అంటువ్యాధులు, అలసట, ఎముక నొప్పి, నిరాశ, ఏదైనా గాయం అయినప్పుడు త్వరగా మానకపోవటం వంటివి కనిపిస్తాయి.

విటమిన్ డి లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు. చిన్న చిన్న పనులు చేసినా బాగా అలిసిపోతారు.. అంతే కాదు విటమిన్ డి లోపం ఉన్నవారికి నిద్రలేమి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అకస్మాత్తుగా ఎముకల నొప్పి, కండరాల నొప్పి, కండరాల బలహీనత విటమిన్ డి లోపం వల్ల కలుగుతాయి. అంతేకాదు..విటమిన్ డి లోపం కారణంగా పలు రకాల చర్మ సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఒంటిపై దద్దుర్లు, మొటిమలు రావడం, వృద్ధాప్య చాయలు, తరచుగా చర్మం పగిలిపోయినట్టుగా మారటం వంటి అనేకరకాల సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా విటమిన్-డి లోపం ఉందని గుర్తించి, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటుగా, ఉదయం పూట సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోండి. సూర్యరశ్మి మన శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. విటమిన్-డి లోపాన్ని నివారిస్తే అనారోగ్య బాధల నుండి బయట పడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ డి ఉత్తమ ఆహార వనరులు కాడ్ లివర్ ఆయిల్, సాల్మన్, స్వోర్డ్ ఫిష్, ట్యూనా ఫిష్, ఆరెంజ్ జ్యూస్, పాల ఉత్పత్తులు, సార్డినెస్, గుడ్డు సొనలు, చీజ్, బీఫ్ లివర్, కొన్ని రకాల పుట్టగొడుగులు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌