Ginger: ఆరోగ్యానికి పచ్చి అల్లం మంచిదా? ఎండు అల్లం మంచిదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Dry Ginger - Fresh Ginger: అల్లం మన శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉన్న పదార్థం. అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ క్రోమియం మొదలైనవి ఉంటాయి. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే, రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది. ఇది మధుమేహం వల్ల వచ్చే సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

Dry Ginger – Fresh Ginger: అల్లం మన శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉన్న పదార్థం. అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ క్రోమియం మొదలైనవి ఉంటాయి. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే, రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది. ఇది మధుమేహం వల్ల వచ్చే సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన మురికి మరియు టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ రక్తాన్ని సహజంగా శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. అయితే, పచ్చి అల్లం మన ఆరోగ్యానికి మంచిదా? లేదా పొడి అల్లం (సొంటి) మంచిదా..? అన్న విషయంలో చాలా గందరగోళం నెలకొంది. అందుకు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
పచ్చి అల్లం: పచ్చి అల్లం లేత గోధుమరంగులో ఉంటుంది. ఇది పీచు ఆకృతిని కలిగి ఉంటుంది. తాజా అల్లం ఘాటైన రుచి, మంటను కలిగి ఉంటుంది. ఇది చాలా వంటలలో, ముఖ్యంగా భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి అల్లం నుంచి టీ కూడా తయారు చేస్తారు.
ఎండు అల్లం (సొంటి): పొడి అల్లం చాలా కాలంపాటు నిల్వ చేస్తారు. అల్లం ఎండబెట్టి పొడి చేసి మెత్తగా రుబ్బుకుంటే చాలాకాలం పాటు వినియోగించవచ్చు. తాజా అల్లంతో పోలిస్తే, ఇది లేత పసుపు రంగు.. కొద్దిగా వాసనను కలిగి ఉంటుంది. ఎండు అల్లం సాధారణంగా వంటలో మసాలాగా ఉపయోగిస్తారు. సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. పాలు, టీలో కూడా వినియోగిస్తారు.
పచ్చి – పొడి అల్లం రెండూ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ వివిధ ప్రాసెసింగ్ పద్ధతుల కారణంగా వాటి పోషక విలువలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. తాజా అల్లంలో దాదాపు 79% నీరు ఉంటుంది. కానీ ఎండు అల్లంలో కేవలం 10% నీరు మాత్రమే ఉంటుంది.
తాజా అల్లం విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ కు అద్భుతమైన మూలం. ఎండు అల్లం ఐరన్, డైటరీ ఫైబర్ కు మంచి మూలం. తాజా అల్లంతో పోలిస్తే ఇందులో జింజెరాల్.. షోగోల్ అధిక స్థాయిలో ఉంటాయి.
ఎండు అల్లం, పచ్చి అల్లం ఏది మంచిది?:
పచ్చి – పొడి అల్లం రెండూ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ ఆహారానికి మరింత రుచి.. మసాలా కావాలనుకుంటే పచ్చి అల్లం ఉపయోగించండి. ఔషధంగా ఉపయోగిస్తుంటే పొడి అల్లం ఉపయోగించండి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..