అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా
'హనుమాన్'తో స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ, PVCU పేరుతో పలు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. మోక్షజ్ఞ, రణ్‌వీర్ సింగ్, ప్రభాస్, జై హనుమాన్ వంటి సినిమాలు వరుసపెట్టి చెప్పినా, ఆచరణలో మాత్రం వేగం కనిపించడం లేదు. అడ్వాన్సులు తీసుకున్నా, 'అధీర' వంటివి ఆగిపోయాయి. ప్రశాంత్ వర్మ ప్రకటించిన సినిమాల భవిష్యత్తుపై సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది.
ప్రశాంత్ వర్మ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా లేదంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్లను కన్ఫ్యూజ్ చేస్తున్నారా..? అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు.. కానీ వర్మ గారి పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఓసారి మోక్షజ్ఞతో సినిమా అంటాడు.. మరోసారి జై హనుమాన్ అంటాడు.. ఇంకోసారి ప్రభాస్ అంటాడు.. అసలీయన అనౌన్స్‌మెంట్ కాకుండా ఏం చేస్తున్నారు..? హనుమాన్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ.. దానికి ముందు అ..!, జాంబిరెడ్డితో గుర్తింపు వచ్చినా.. హనుమాన్‌తోనే ఆయన స్టార్ అయ్యారు. దానికితోడు PVCU పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసారు ప్రశాంత్ వర్మ. అందులోనే హనుమాన్ వచ్చింది.. ఇంకా చాలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈయనేం చేస్తున్నారనేది అందరికీ కన్ఫ్యూజనే. హనుమాన్ తర్వాత.. ముందు చాలా సినిమాలకు కమిటయ్యారు ప్రశాంత్ వర్మ. కొన్ని సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్నారు. అందులో అధీర ఒకటి. నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. టీజర్‌తోనే సరిపెట్టేసారు ప్రశాంత్.. పైగా దీనికి దర్శకుడు మారాడిప్పురు. అలాగే రణ్‌వీర్ సింగ్, మోక్షజ్ఞ సినిమాలు అనౌన్స్‌మెంట్ దగ్గరే ఆగిపోయాయి. PVCUలో భాగంగా మహాకాళి సినిమా నిర్మిస్తున్నారు వర్మ. జై హనుమాన్ అనౌన్స్ చేసి చాలా రోజులైనా ముందుకు కదలట్లేదు. ఈ మధ్యే ప్రభాస్ సినిమాతో పాటు జాంబిరెడ్డి 2 సైతం ఉంటుందంటున్నారు. అనౌన్స్‌మెంట్స్‌లో ఉన్న దూకుడు.. ఆచరణలో కనిపించట్లేదు. ప్రశాంత్ వర్మ ఇవన్నీ ఎప్పటికి పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీక్వెల్స్ ట్రెండ్.. మీడియం రేంజ్ సినిమాలకు అదే ఆయువుపట్టు
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??
2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు..

