షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??
తెలుగు సినిమా పరిశ్రమ షూటింగ్‌లతో సందడిగా మారింది. స్టార్ హీరోలంతా తమ ప్రాజెక్టులతో సెట్స్‌లో బిజీగా ఉన్నారు. నాని, ప్రభాస్, మహేష్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోలు దేశ విదేశాల్లో షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. సంక్రాంతి హీరోలు సైతం నెక్ట్స్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. ప్రస్తుతం తెలుగు సినీ లోకం షూటింగ్ సందడితో కళకళలాడుతోంది.
తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది.. ఎవరో అక్కడక్కడా ఒకరిద్దరు హీరోలు మినహా.. అందరూ లొకేషన్‌లోనే బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్స్ అంతా సెట్స్‌లోనే ఉన్నారు. సంక్రాంతి హీరోలు సైతం నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచేసారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..? షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలుపెడదాం. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్.. అఖిల్ లెనిన్.. జేడీ చక్రవర్తి కొత్త సినిమాల షూటింగ్స్ ఆ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇక శర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్ అధీరా సినిమాల సెట్ వర్క్స్ అక్కడే జరుగుతున్నాయి. ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ దండుమైలారంలో.. మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్‌గా జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ కూడా గండిపేటలోనే జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో నెల రోజులుగా జరుగుతుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ జోర్డాన్‌కు షిఫ్ట్ అయింది. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయీనాబాద్‌లో.. రవితేజ ఇరుముడి షూటింగ్ సీలేరు పరిసర ప్రాంతాల్లో.. నాగచైతన్య వృషకర్మ షూటింగ్ మొహింజాదీ మార్కెట్‌లో.. గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్ర షూటింగ్ అజీజ్ నగర్‌లో జరుగుతున్నాయి. మొత్తానికి హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..
Jr NTR: ఎన్టీఆర్‌పై వార్ 2 ఎఫెక్ట్.. ఆ మాత్రం ఉంటుందిలే
Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు
Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??
Raashii Khanna: సినిమా ఛాన్స్ లేకపోతే ఏంటి.. నాకు సోషల్ మీడియా ఉందిగా అంటున్న రాశీ ఖన్నా
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు..

