AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??

Phani CH
|

Updated on: Feb 11, 2026 | 7:54 PM

Share

బంగారం ధరలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి, జనవరిలో రికార్డు స్థాయికి చేరాయి. భవిష్యత్తులో మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 11న పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి, 24K, 22K బంగారం ధరలు తగ్గుతూ పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వివిధ నగరాల్లో ప్రస్తుత ధరల వివరాలు.

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగాయి. గతేడాది నుండి చూస్తే బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. ఏకంగా 10 గ్రాములు రెండు లక్షల రూపాయల వరకు చేరుకునే పరిస్థితి కనిపించింది. జనవరి నెలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు నింగిని తాకాయి. ఫిబ్రవరి నెల వచ్చేసరికి కాస్త తగ్గుముఖం పట్టినా పసిడి పెరుగుదల మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. భవిష్యత్తులో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పసిడి పేరు వింటేనే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే ఈ రోజు ఫిబ్రవరి 11 బుధవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. 24 క్యారట్ల బంగారంపై రూ.270లు తగ్గి రూ.1,58,510లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250లు తగ్గి రూ.1,45,300లుగా ఉంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం కిలో వెండి ధర రూ.3,00,000లుగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,660 దగ్గర ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,450 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,58,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,300 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,280 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,46,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,300లు పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,00,000లుగా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raashii Khanna: సినిమా ఛాన్స్ లేకపోతే ఏంటి.. నాకు సోషల్ మీడియా ఉందిగా అంటున్న రాశీ ఖన్నా

గోల్డెన్ ఛాన్స్.. చేతులారా నాశనం చేసుకున్నారుగా

Ranveer Singh: చిక్కుల్లో ధురంధర్ స్టార్‌.. రణవీర్‌ సింగ్‌ కు షాక్ ఇచ్చిన నిర్మాతలు

Pawan Kalyan: పవన్‌ నెక్ట్స్ మూవీ అప్‌డేట్‌.. జోడీ సెట్ అయినట్టేనా

Salman Khan: సల్మాన్ ఖాన్ కు దెబ్బ మీద దెబ్బ.. టెన్షన్ లో ఫ్యాన్స్