AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిల్లెట్స్ తో ఎలాంటి సమస్యలైన తరిమికొట్టచ్చని తెలుసా?

మిల్లెట్స్ లో కొవ్వు నిల్వ చేయనివ్వదు. వీటిని తినడం వలన అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా గుండె సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును పెరగనివ్వకుండాతోడ్పడుతుంది. వీటి వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మిల్లెట్స్ తో ఎలాంటి సమస్యలైన తరిమికొట్టచ్చని తెలుసా?
Milets
Prasanna Yadla
|

Updated on: Feb 11, 2026 | 9:43 PM

Share

మిల్లెట్స్ ను చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు. అయితే, ఇది ఇచ్చే శక్తి ఏది కూడా ఇవ్వదు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో ఎంతో మంది టిఫిన్స్ చేసుకుని తింటారు. ఇంకొందరు నార్మల్ గా తింటారు. అయితే, వీటిని ఎలా తిన్నా కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రాగులు, జొన్నలు, సజ్జలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

షుగర్ లెవల్స్

మిల్లెట్స్ లో ఉండే కొన్ని పదార్ధాలు ఇన్సులిన్ ను మెరుగుపరస్తుంది. ఇంకా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెరగకుండా చూసుకుంటుంది. అలాగే, ఇది డయాబెటిస్‌కు సమస్యకు పూర్తిగా చెక్ పెడుతుంది. కాకపోతే మీరు దీనిని తినే ముందు వైద్యున్ని సంప్రదించి తాగడం మంచిదని అంటున్నారు.

మెరుగైన జీర్ణక్రియ

మిల్లెట్స్ లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. మీరు వీటిని రెండు రోజులకొకసారి తింటే కడుపు నొప్పి, జీర్ణ సంబధిత సమస్యలు రాకుండా చేస్తాయి. కాబట్టి వీటిని అలవాటు చేసుకుని తినండి.

బరువు తగ్గుతారు

మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి.  అధిక బరువుతో బాధ పడేవారు వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. ఇవి బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, అధిక బరువు ఉన్న వారు ఉదయం, రాత్రి పూట తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గుండె ఆరోగ్యం

మిల్లెట్స్ లో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే గుండె సమస్యలతో ఇబ్బంది పడే వారు వీటిని తీసుకోవడం చాలా మంచిది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించడంలో మిల్లెట్స్ సహాయపడతాయి.

రోగనిరోధక శక్తిని

మిల్లెట్స్ లో  ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.  మీకు ఎప్పుడైనా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ బలపడి ఆ సమస్యల మీద పోరాడేలా ఇది సహాయం చేస్తుంది.

NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!