AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

Arjun Tendulkar Wedding : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముంబై నగరం మరో భారీ వేడుకకు సిద్ధమవుతోంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం మార్చి 3న ఘనంగా జరగనుంది. గతేడాది అంబానీ ఇంట జరిగిన పెళ్లి సందడి గుర్తుంది కదా.. ఇప్పుడు సచిన్ వారసుడి పెళ్లి కూడా అదే స్థాయిలో ఉండబోతోంది.

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్
Sachin Tendulkar
Rakesh
|

Updated on: Feb 12, 2026 | 6:53 AM

Share

Arjun Tendulkar Wedding : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముంబై నగరం మరో భారీ వేడుకకు సిద్ధమవుతోంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం మార్చి 3న ఘనంగా జరగనుంది. గతేడాది అంబానీ ఇంట జరిగిన పెళ్లి సందడి గుర్తుంది కదా.. ఇప్పుడు సచిన్ వారసుడి పెళ్లి కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్‎ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే సచిన్ స్వయంగా వెళ్లి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు క్రికెట్, సినీ రంగాలకు చెందిన ప్రముఖుల జాబితా చాలా పెద్దగానే ఉంది.

ఈ పెళ్లి సందడిలో అర్జున్ టెండూల్కర్ కంటే ఎక్కువగా సచిన్-అంజలి దంపతుల ప్రేమకథ మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. అర్జున్ పెళ్లి ముచ్చట్ల మధ్య.. అసలు సచిన్ తన భార్య అంజలిని ఎలా ప్రేమించాడు? ఆ కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ టెండూల్కర్ తన కొడుకు పెళ్లిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ దిగ్గజాలైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి సినీ సెలబ్రిటీలు, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు ఈ వేడుకలో తళుక్కున మెరవనున్నారు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం క్రికెట్ లో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు.

అర్జున్ పెళ్లి చర్చల మధ్య సచిన్-అంజలి లవ్ స్టోరీ మళ్ళీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. 1990లో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు సచిన్‌కు కేవలం 17 ఏళ్లే. అంజలి మెడికల్ స్టూడెంట్. నిజానికి ఆమెకు క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎయిర్‌పోర్ట్‌లో కోక్రా జుట్టుతో ఉన్న ఒక కుర్రాడిని చూసి ఆమెకు తెలియని ఆకర్షణ కలిగింది. ఆ కుర్రాడు సచిన్ అని పక్కన ఉన్నవాళ్లు చెబితే గానీ ఆమెకు తెలియలేదు. ఆ తర్వాత అంజలి ఎలాగైనా సచిన్ ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చేసింది.

సచిన్ ఫోన్ ఎత్తగానే అంజలి.. “నన్ను గుర్తుపట్టావా? ఎయిర్‌పోర్ట్‌లో నీ వెనుక పరిగెత్తాను” అని అడిగింది. సచిన్ కూడా ఏమాత్రం తడుముకోకుండా “గుర్తుందీ.. నువ్వు ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్నావు కదా” అని చెప్పడంతో అంజలి షాక్ అయ్యింది. అలా మొదలైన వీరి పరిచయం ఐదేళ్ల పాటు ప్రేమగా సాగింది. సచిన్ అప్పట్లో ఎంత పాపులర్ అంటే.. అంజలితో కలిసి సినిమా చూడటానికి వెళ్లేటప్పుడు నకిలీ గడ్డం, మీసాలు తగిలించుకుని వెళ్లేవాడట. రోజా సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో గడ్డం ఊడిపోవడంతో మధ్యలోనే బయటకు వచ్చేశారట.

మార్చి 3న జరగబోయే ఈ పెళ్లికి సానియా చందోక్ కుటుంబం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అర్జున్, సానియా చాలా కాలంగా స్నేహితులు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. సచిన్ టెండూల్కర్ తన వ్యక్తిగత సంబంధాల వల్ల రాజకీయ, సినీ, క్రీడా రంగాలలోని ప్రముఖులందరినీ ఆహ్వానించడంతో ఇది 2026లోనే అతిపెద్ద వేడుకగా నిలవనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us