AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన జాతీయ జెండాతో ఉన్న హెల్మెట్ ధరించి.. సెంచరీతో కదంతొక్కిన శ్రీలంకన్ లెజెండ్

శ్రీలంక దిగ్గజం కుమార సంగాకర టీమిండియా హెల్మెట్ ధరించి సెంచరీ చేయడం వైరల్‌గా మారింది. యశస్వి జైస్వాల్ ప్రేమతో ఇచ్చిన ఈ హెల్మెట్‌ను సంగాకర శ్రీలంకలోని ఓ విలేజ్ టోర్నీలో ధరించి, 168 పరుగులు చేశాడు. మన జాతీయ జెండా, బీసీసీఐ లోగో ఉన్న టీమిండియా హెల్మెట్లు ఎందుకు ప్రత్యేకమో, సచిన్ టెండూల్కర్ పాత్రను ఈ కథనం వివరిస్తుంది. ఇది క్రికెట్ స్ఫూర్తికి నిదర్శనం.

మన జాతీయ జెండాతో ఉన్న హెల్మెట్ ధరించి.. సెంచరీతో కదంతొక్కిన శ్రీలంకన్ లెజెండ్
Kumar Sangakkara
SN Pasha
|

Updated on: Jun 19, 2026 | 2:30 PM

Share

సాధారణంగా ఏ టీమ్‌కు ఆడే ఆటగాళ్లు ఆ టీమ్‌కు సంబంధించిన హెల్మెట్లు ధరిస్తారు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అయితే దీనిపై మరింత కచ్చితంగా ఉంటారు. అయితే చాలా దేశాల కంటే మన టీమిండియా ఆటగాళ్ల హెల్మెట్లు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే బీసీసీఐ లోగో పైనే మన జాతీయ జెండా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం టీమిండియా క్రికెటర్ల హెల్మెట్లపైన కేవలం బీసీసీఐ లోగో మాత్రమే ఉండేది. కానీ ఆ లోగోతో పాటు జాతీయ జెండా కూడా ఉండే హెల్మెట్ తొలుతు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ధరించారని క్రికెట్ నిపుణులు చెబుతుంటారు. అప్పటి నుంచి దాదాపు అందరూ క్రికెటర్లు అలాంటి హెల్మెట్లనే వాడుతున్నారు.

తాజా శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు, కెప్టెన్ అయిన సంగక్కర సైతం మన జాతీయ జెండా, బీసీసీఐ లోగో ఉన్న హెల్మెట్ ధరించాడు. కేవలం ధరించడమే కాదు.. ఆ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. 168 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని పరుగుల గురించి పక్కనపెడితే.. సంగక్కర మన జాతీయ జెండాతో ఉన్న హెల్మెట్ ఎందుకు ధరించాడు? ఏ మ్యాచ్‌లో ధరించాడు? ఇవే కదా మీ డౌట్స్. అక్కడికే వస్తున్నా.. ఆగండి. ఐపీఎల్‌లో సంగక్కర రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందేగా. అదే టీమ్‌కు ఆడుతున్న మన యంగ్ టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్.. గురు దక్షిణగా తన టీమిండియా హెల్మెట్‌ను సంగక్కరకు బహూకరించాడు.

ఆటగాళ్లు తమ జెర్సీలను, హెల్మెట్లను, బ్యాట్లను ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకోవడం సాధారణమే. చాలా మంది ఆటగాళ్లు అలా తమకొచ్చిన వాటిని ఇంట్లో భద్రంగా భద్రపర్చుకుంటారు. కానీ సంగక్కర మాత్రం తనకెంతో ప్రేమతో జైస్వాల్ ఇచ్చాడని, ఇంట్లో ఓ మూల పెట్టేయకుండా దాన్ని ఓ మ్యాచ్‌లో ధరించాడు. శ్రీలంకలో జరిగిన ఓ విలేజ్ టోర్నీలో సంగక్కర, జైస్వాల్ ఇచ్చిన టీమిండియా హెల్మెట్ ధరించి ఆడాడు. సెంచరీతో సత్తా చాటాడు. ప్రస్తుతం సంగక్కర టీమిండియా హెల్మెట్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us