AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పండ్లు తినడం మంచిదా..? జ్యూస్ తాగడం మంచిదా..? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది..

Fruit juice vs fruit: పండ్లు ఆరోగ్యానికి చాలామంచిది. అయితే, పండ్లకు, పండ్ల రసానికి చాలా తేడా ఉంది. పండ్లు తినడం మంచిదా? లేక జ్యూస్ తాగడం మంచిదా? అన్న గందరగోళం సర్వసాధారణం. రెండూ పండ్లతో తయారు చేసినప్పటికీ, రెండింటిలోని పోషకాల విషయంలో చాలా తేడా ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన ఎంపికను చూసుకుంటే.. జ్యూస్ కంటే పండు తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Health: పండ్లు తినడం మంచిదా..? జ్యూస్ తాగడం మంచిదా..? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది..
Fruit Juice Vs Fruit
Shaik Madar Saheb
|

Updated on: Nov 08, 2023 | 10:46 AM

Share

Fruit juice vs fruit: పండ్లు ఆరోగ్యానికి చాలామంచిది. అయితే, పండ్లకు, పండ్ల రసానికి చాలా తేడా ఉంది. పండ్లు తినడం మంచిదా? లేక జ్యూస్ తాగడం మంచిదా? అన్న గందరగోళం సర్వసాధారణం. రెండూ పండ్లతో తయారు చేసినప్పటికీ, రెండింటిలోని పోషకాల విషయంలో చాలా తేడా ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన ఎంపికను చూసుకుంటే.. జ్యూస్ కంటే పండు తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే జ్యూస్‌కు బదులు తాజా పండ్లను తినమని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతిరోజూ ఒక గ్లాసు పండ్ల రసం తాగడం కూడా రోజును ప్రారంభించడానికి ఆరోగ్యకరమైన మార్గంగా చెబుతున్నారు. అయితే ఫ్రూట్ జ్యూస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అంత ఆరోగ్యకరం కాదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. పండ్లు, పండ్ల రసానికి సంబంధించి ఏది మంచిదో చూడండి..

ఫ్రూట్ జ్యూస్‌తో ప్రధాన సమస్య ఏమిటంటే, ఇందులో కేలరీలు, యాసిడ్ కంటెంట్ చూసుకుంటే.. చక్కెరలో ఎక్కువ, ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉండవు.. పండ్లను వాటి రసం కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన.. ప్రయోజనకరమైనదిగా పరిగణించడానికి ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ఫైబర్ లేకపోవడం: ఫైబర్ మన శరీరానికి చాలా ముఖ్యమైన అంశం. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. కానీ మనం పండ్లకు బదులుగా జ్యూస్ తాగినప్పుడు, పండులోని ఫైబర్ మొత్తం ఫిల్టర్ అవుతుంది.

అదనపు కేలరీలు: పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ దీనిని జ్యూస్ రూపంలో తీసుకుంటే క్యాలరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఒక గ్లాసు జ్యూస్ తాగితే అందులో చాలా పండ్ల రసం ఉంటుంది. మీరు ప్యాక్‌డ్ జ్యూస్‌ను తాగుతున్నట్లయితే, అందులో చక్కెరను జోడించడం వల్ల కేలరీలు మరింత పెరుగుతాయి.

సూక్ష్మపోషక లోపం: పండ్ల రసం అనేక ప్రక్రియల ద్వారా తయారు చేస్తారు. దీని వల్ల ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక సూక్ష్మపోషకాలు పోతాయి. అందుకే ఎక్కువగా పండ్లు తినడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కడుపు నిండుగా ఉండటంతోపాటు.. పోషకాలు అందుతాయని పేర్కొంటున్నారు. అందుకే సాధ్యమైనంత మేరకు పండ్లనే తినాలంటున్నారు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌