AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk & Calcium: రోజూ గ్లాసుడు పాలు తాగితే సరిపడా కాల్షియం అందుతుందా? అదనంగా కావాలంటే ఏం చేయాలి..

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోజూ ఏదో ఒక సమయంలో గ్లాసుడు పాలు తాగుతుంటారు. శరీర పెరుగుదల, బలానికి పాలు ఎంతో దోహదపడతాయి. జీవనశైలి, ఆహార అలవాట్లు మారుతున్నప్పటికీ పాలు ఇప్పటికీ పోషకాహార జాబితాలో టాప్‌ స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎముకలు, దంతాల ఆరోగ్యం విషయానికి..

Milk & Calcium: రోజూ గ్లాసుడు పాలు తాగితే సరిపడా కాల్షియం అందుతుందా? అదనంగా కావాలంటే ఏం చేయాలి..
Can Drinking Milk Make Your Bones More Strong
Srilakshmi C
|

Updated on: Feb 12, 2026 | 8:05 AM

Share

పాలు ఆరోగ్యానికి మేలు చేయస్తాయన్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోజూ ఏదో ఒక సమయంలో గ్లాసుడు పాలు తాగుతుంటారు. శరీర పెరుగుదల, బలానికి పాలు ఎంతో దోహదపడతాయి. జీవనశైలి, ఆహార అలవాట్లు మారుతున్నప్పటికీ పాలు ఇప్పటికీ పోషకాహార జాబితాలో టాప్‌ స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎముకలు, దంతాల ఆరోగ్యం విషయానికి వస్తే మొదట గుర్తుకు వచ్చేది పాలు. కానీ ఇటీవలి కాలంలో కాల్షియం లోపానికి సంబంధించిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీని కారణంగా జనాలు తమ ఆహార అలవాట్లు గురించి మునుపటి కంటే ఎక్కువ అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే శరీర కాల్షియం అవసరాలను తీర్చడానికి ప్రతిరోజూ పాలు మాత్రమే తాగితే సరిపోతుందా? లేదా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

పాలు నిజంగా కాల్షియం లోపాన్ని భర్తీ చేస్తాయా?

లేడీ హార్డింగ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ మాట్లాడుతూ.. ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి మంచి మొత్తంలో కాల్షియం లభిస్తుందని, ఇది శరీరం సులభంగా గ్రహించడానికి తోడ్పడుతుందని చెప్పారు. పాలలోని విటమిన్ డి శరీరంలోని కాల్షియం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అందుకే ఎముకలు, దంతాల బలానికి పాలు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతారు. కానీ ప్రతి ఒక్కరి శరీరంలో కాల్షియం అవసరం ఒకేలా ఉండదు. ఇది వయస్సు, లింగం, జీవనశైలి, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో కాల్షియం తీవ్రంగా ఉంటే పాలు మాత్రమే తాగితే సరిపోదు. ఇలాంటి సందర్భాలలో పెరుగు, జున్ను, ఆకుపచ్చ కూరగాయలు, నువ్వులు, బాదం వంటి ఆహారాలను పాలతో పాటు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి వివిధ వనరుల నుంచి కాల్షియం అందించడానికి సహాయపడుతుంది. మొత్తం మీద పాలు కాల్షియం లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. కానీ సమతుల్య ఆహారం లేకుండా కాల్షియం లోపాన్ని పూర్తిగా అధిగమించడం కష్టం.

రోజుకు ఎన్ని గ్లాసుల పాలు తాగాలి?

ఆరోగ్యవంతులైన పెద్దలు సాధారణంగా రోజుకు 2 గ్లాసులు లేదా 400 నుంచి 500 ml పాలు తాగవచ్చు. ఇది రోజువారీ కాల్షియం అవసరాన్ని తీరుస్తుంది. పిల్లలు, గర్భిణీలు వారి అవసరాలకు అనుగుణంగా పాలతోపాటు ఇతర కాల్షియం అందించే ఆహారాలను తీసుకోవల్సి ఉంటుంది. లాక్టోస్ ఎలర్జీ ఉన్నవారు పాలు తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. అవసరమైన దానికంటే ఎక్కువ పాలు తాగడం ప్రయోజనకరం కాదని మర్చిపోకూడదు. వీటన్నింటితో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా వినియోగాన్ని తగ్గించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.